కప్పు దక్కకపోయినా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అవార్డుల పంట
సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఏ స్థాయిలో చెలరేగిపోయాడో ఐపీఎల్‌లో చూశాం. పిడుగుల్లాంటి షాట్లతో సిక్సుల మీద సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల అవార్డు గెలుచుకున్నాడు
ఐపీఎల్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టు మీద చతికిలపడింది. ఫైనల్లో ఘోరంగా ఓడిపోయింది. కప్పు దక్కకపోయినా ఈ సీజన్‌లో ఆ జట్టు ఎన్నో సానుకూల ఫలితాలు రాబట్టింది. బ్యాటింగ్‌లో సూపర్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌లో ఆ జట్టుకు బోల్డన్ని అవార్డులు దక్కడం ఊరట కలిగించింది.
ఎమర్జింగ్ ప్లేయర్‌గా నితీష్‌రెడ్డి
ఈ సీజన్‌లో తెలుగు ఆటగాడు నితీష్‌కుమార్ రెడ్డి తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో సూటబుల్ ఆటగాడినని నిరూపించుకున్నాడు. అతనికి ఈ ఐపీఎల్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కింది.
సిక్సుల్లో అభిషేక్.. ఫోర్లలో హెడ్
సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఏ స్థాయిలో చెలరేగిపోయాడో ఐపీఎల్‌లో చూశాం. పిడుగుల్లాంటి షాట్లతో సిక్సుల మీద సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల అవార్డు గెలుచుకున్నాడు. ఇదే జట్టులో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు అత్యధిక ఫోర్ల అవార్డు దక్కింది.
ఉప్పల్ స్టేడియంకూ పురస్కారం
ఇదిలా ఉంటే ఎస్ఆర్హెచ్ సొంత గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంకు కూడా అవార్డు దక్కింది. ఈడెన్ గార్డెన్స్, చిన్నస్వామి, చెపాక్ లాంటి మేటి స్టేడియంలను కాదని ఉప్పల్ స్టేడియంలోని పిచ్‌కు బెస్ట్ అవార్డు దక్కింది. అవార్డు కింద ప్రైజ్ మనీగా రూ.50 లక్షలు దక్కింది.