రిటైర్మెంట్ ప్రకటించిన దీపా కర్మాకర్
కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది. ఎంతో ఆలోచించిన తర్వాత జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నది. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ వీడ్కోలు కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో జిమ్నాస్టిక్స్ అంటే దీపా కర్మాకర్ పేరే వినిపిస్తుంది. 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటింది. 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. వరల్డ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కీ, ఒలింపిక్స్‌కీ అర్హత సాధించిన మొదటి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2016 ఒలింపిక్స్‌లో 0.15 పాయింట్లతో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది అమ్మాయిలు జిమ్నాస్టిక్స్‌లో చేరిన సంగతి తెలిసిదే. ఈ ఏడాది జరిగిన ఆసియా జమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి.. ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.