డేవిడ్ వార్నర్, పడిక్కల్ అన్‌సోల్డ్
ఇద్దరినీ తీసుకునేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
ఐపీఎల్ మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తో పాటు టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ ఇద్దరు వేలంలో అన్‌సోల్డ్ జాబితాలో ఉండిపోయారు. తక్కువ బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్లను దక్కించుకునేందుకు పోటీపడ్డ ఫ్రాంచైజీలు వార్నర్, పడిక్కల్ కోసం పోటీ పడేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.9.75 కోట్లకు, డేవిడ్ కాన్వేను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.75 లక్షల బేస్‌ప్రైస్ ఉన్న రాహుల్ త్రిపాఠిని రూ.3.40 కోట్లకు చెన్నై వేలంలో దక్కించుకుంది. రచిన్ రవీంద్రను రూ.4 కోట్లకు చెన్నై టీమ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్ కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లకు, స్టార్క్ ను రూ.11.75 కోట్లకు. జేక్ ఫ్రేసర్ మెక్‌గూర్క్ ను రూ.9 కోట్లకు, హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు సొంతం చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు, మహ్మద్ సిరాజ్ ను రూ.12.25 కోట్లకు, రబాడాను రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ను స్టార్ కీపర్ రిషబ్ పంత్ ను ఐపీఎల్‌లోనే అత్యధికంగా రూ.27 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. డేవిడ్ మిల్లర్ ను రూ.7.50 కోట్లకు, మార్‌క్రమ్‌ను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో రెండో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ గా అయ్యర్ చరిత్ర సృష్టించారు. చాహల్, అర్షదీప్ సింగ్‌లకు తలా రూ.18 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ లివింగ్‌స్టోన్ ను రూ.8.75 కోట్లకు దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు హర్షల్ పటేల్ ను రూ.8 కోట్లకు దక్కించుకుంది.