Telugu Global
Sports

ప్రపంచకప్ సూపర్- 8 షోకి కౌంట్ డౌన్!

ఐసీసీ-టీ-20 ప్రపంచకప్ తొలిదశ గ్రూపులీగ్ పోటీలు ముగియడంతో ఎనిమిదిజట్ల సూపర్-8 రౌండ్ షోకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది....

ప్రపంచకప్ సూపర్- 8 షోకి కౌంట్ డౌన్!
X

ఐసీసీ-టీ-20 ప్రపంచకప్ తొలిదశ గ్రూపులీగ్ పోటీలు ముగియడంతో ఎనిమిదిజట్ల సూపర్-8 రౌండ్ షోకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది....

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ తొలిదశ గ్రూప్ లీగ్ పోటీలు సంచలనాలు, వానదెబ్బలతో ముగిసింది.

మొత్తం నాలుగు గ్రూపుల్లో మొదటి రెండుస్థానాలలో నిలిచిన ఎనిమిదిజట్లు...రెండోదశ సూపర్-8 రౌండ్లలో తలపడబోతున్నాయి.

లీగ్ దశ నుంచే శ్రీలంక, న్యూజిలాండ్ అవుట్....

ప్రపంచకప్ గ్రూపు లీగ్ దశ నుంచే మాజీ చాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంక, మాజీ రన్నరప్ న్యూజిలాండ్ జట్లు అనూహ్యంగా నిష్క్ర్రమించాయి. ఈ రెండుజట్లతో పాటు..సూపర్-8 బెర్త్ లు సాధించడంలో విఫలమైన ఇతర జట్లలో కెనడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, పాపువా న్యూగినియా, ఒమాన్, ఉగాండా, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.

పూల్- ఏ టాపర్ గా భారత్....

భారత్, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడాజట్లతో కూడిన పూల్ - ఏ లీగ్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు టాపర్ గా నిలిచింది. మొత్తం నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో కెనడాతో పోరు వానదెబ్బతో రద్దు కాగా మిగిలిన మూడు మ్యాచ్ ల్లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాజట్లను ఓడించడం ద్వారా భారత్ మొత్తం 7 పాయింట్లతో సూపర్-8 రౌండ్లో అడుగుపెట్టింది.

ప్రపంచకప్ బరిలో తొలిసారిగా నిలిచిన పసికూన అమెరికా సైతం గ్రూపులీగ్ లో 5 పాయింట్లు సాధించడం ద్వారా సూపర్- 8 బెర్త్ సంపాదించగలిగింది. పాకిస్థాన్ 4 పాయింట్లు, కెనడా 3 పాయింట్లు, ఐర్లాండ్ ఒక్కపాయింటుతో గ్రూపు 3, 4, 5 స్థానాలలో నిలిచాయి.

ఆస్ట్ర్రేలియా అలవోకగా.....

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, నమీబియా, ఒమాన్, స్కాట్లాండ్ జట్లతో కూడిన పూల్- బీ మొదటి రెండుస్థానాలలో ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ జట్లు నిలిచాయి.

ఆస్ట్ర్రేలియా నాలుగుకు నాలుగు రౌండ్లూ నెగ్గడం ద్వారా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే..ఇంగ్లండ్ 5 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా సూపర్-8 రౌండ్ బెర్త్ సంపాదించాయి. ఇంగ్లండ్ తో సమానంగా స్కాట్లాండ్ సైతం 5 పాయింట్లు సాధించినా..నెట్ రన్ రేట్ ప్రకారం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నమీబియా 2 పాయింట్లు, ఒమాన్ పాయింట్లేవీ లేకుండాను గ్రూపు ఆఖరి రెండుస్థానాలు దక్కించుకొ్నాయి.

అప్ఘన్, వెస్టిండీస్ జోరు....

అప్ఘనిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండా, పాపువా న్యూగినియా జట్లతో కూడిన గ్రూప్- సీ లీగ్ లో రెండుసార్లు విజేత వెస్టిండీస్, అప్ఘనిస్థాన్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా సూపర్- 8 రౌండ్ బెర్త్ లు సంపాదించాయి. న్యూజిలాండ్ 3 రౌండ్లలో 2 పాయింట్లు మాత్రమే సాధించి లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ఉగాండా నాలుగు, పాపువా న్యూగినియా ఐదు స్థానాలలో మిగిలాయి.

పూల్- డీలో దక్షిణాఫ్రికా టాప్...

దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్లతో కూడిన గ్రూప్- డీ లీగ్ లో దక్షిణాఫ్రికా నాలుగుకు నాలుగురౌండ్లూ నెగ్గి 8 పాయింట్లతో టాపర్ గా సూపర్- 8 రౌండ్లో అడుగుపెట్టింది.

4 రౌండ్లలో 3 విజయాలు, 6 పాయింట్లతో బంగ్లాదేశ్ రన్నరప్ గా సూపర్- 8 బెర్త్ సాధించగా...శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఆఖరి రెండుస్థానాలలో నిలిచాయి.

జూన్ 19 నుంచి జరుగనున్న సూపర్-8 రౌండ్ తొలిమ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో పసికూన అమెరికా తలపడనుంది. ఆంటీగా వేదికగా ఈమ్యాచ్ జరుగనుంది.

హాట్ ఫేవరెట్ భారత్ ..సూపర్-8 రౌండ్లో తన తొలిమ్యాచ్ ను బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా అప్ఘనిస్థాన్ తో ఈనెల 20న ఆడనుంది.

భారత్, అమెరికా, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్

First Published:  17 Jun 2024 5:20 PM IST
Next Story