ఛాంపియన్స్ ట్రోఫి: బూమ్రా ఔట్.. హర్షిత్ రాణా ఇన్
వెన్నునొప్పితో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫికి దూరం
![ఛాంపియన్స్ ట్రోఫి: బూమ్రా ఔట్.. హర్షిత్ రాణా ఇన్ ఛాంపియన్స్ ట్రోఫి: బూమ్రా ఔట్.. హర్షిత్ రాణా ఇన్](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402641-bumrah.webp)
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫికి దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరల్లో వెన్నునొప్పితో బాధపడ్డ బుమ్రా... అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అహ్మాదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో బమ్రా ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాలేదు. అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి పరిమితమయ్యాడు. దీంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బుమ్రాను పక్కనపెట్టి.. హర్షిత్ రాణాకు జట్టులో చోటు కల్పించారు. మరోవైపు యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. అతని స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రిషభ్ పంత్ (కీపర్) హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి