చిక్కుల్లో మిచెల్ మార్ష్.. భారత్‌లో కేసు నమోదు
వరల్డ్ కప్‌పై మిచెల్ కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. మార్ష్‌పై ఇండియాలో FIR నమోదు కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆసీస్ క్రికెటర్ మిచెల్ మార్ష్ చికుల్లో పడ్డాడు. వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఘటనతో మార్ష్‌పై ఇండియాలో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన RTI కార్యకర్త పండిట్ కేశవ్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మిచెల్ మార్ష్ ట్రోఫీని అవమానించాడని, 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచాడని కేశవ్ తన ఫిర్యాదులో తెలిపారు.
వరల్డ్ కప్‌పై మార్ష్ కాళ్లు పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండియా ఓడిపోవడం కంటే మిచెల్ మార్ష్ చేసిన దానిపైనే ఎక్కువ చర్చ జరిగింది. కీలక పోరులో ఆసీస్ ప్రదర్శనను అంతా మెచ్చుకున్నారు. కానీ మిచెల్ మార్ష్ చేసిన పని ఆసీస్ పరువు తీసింది. ఇదే అంశంపై టీమిండియా సీనియర్ పేసర్ షమీ కూడా స్పందించాడు. మిచెల్ అలా చేయడం వల్ల నేను చాలా బాధపడ్డా. ఎన్నో జట్లు వరల్డ్ కప్‌లో ట్రోఫీ కోసం పోరాడాయి. అలాంటి ట్రోఫీని తల మీద పెట్టుకోవాలి, కానీ కాళ్లు పెట్టడం నాకు అస్సలు నచ్చలేదని షమీ చెప్పాడు.