విరాట్ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ చెప్పాడు
బస్సు డ్రైవర్ సూచనలకు తాను షాకయ్యానన్న రైల్వేస్ బౌలర్ హిమాన్షు
రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంఘ్వాన్ రంజి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి వార్తల్లో నిలిచాడు. విరాట్ వికెట్ ఎలా తీయాలో తమ జట్టు బస్సు డ్రైవర్ తనకు సూచన చేశాడని హిమాన్షు పేర్కొన్నాడు. 5వ స్టంప్‌లైన్‌లో బౌలింగ్ చేయాలని సూచించినట్టు వెల్లడించాడు. బస్సు డ్రైవర్ సూచనలకు తాను షాకయ్యానని.. కోహ్లీ బలహీనతలపై కాకుండా తన బలాలపై దృష్టి పెట్టి బౌలింగ్ చేసినట్టు తెలిపారు. కోహ్లీ కొంతకాలంగా ఆఫ్‌సైడ్ బైట పడిన బాల్స్‌ను ఆడటంలో ఇబ్బది పడుతున్నాడనే విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌లో సరైన ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలోకి తిరిగి రావడం పట్ల భారీ అంచనాలు నెలకాన్నాయి, కోహ్లీ ఆటను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే సంఘ్వాన్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులకే ఔట్ కావడంతో వారంతా షాక్ గురయ్యారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీని ఔట్ చేసే మార్గాల గురించి తమ బస్సు డ్రైవర్ నుంచి తనకు అందిన సలహాను పేసర్ హిమాన్షు సంఘ్వాన్ వెల్లడించాడు.