Telugu Global
Sports

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీ.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో 150కే టీమిండియా ఆలౌట్‌

ఆసీస్‌ బౌలర్ల దాటికి కుప్పకూలిన ఇండియా

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీ.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో 150కే టీమిండియా ఆలౌట్‌
X

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీ ఫస్ట్‌ టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి క్రీజ్‌ లో ఇండియా బ్యాట్స్‌మన్‌ కుదురుకోలేదు. పెర్త్‌ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్ట్‌ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఐదు పరుగులకే మొదటి వికెట్‌ ను కోల్పోయింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ డకౌట్‌ అయ్యాడు. ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ 23 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ కు చేరాడు. దీంతో 14 పరుగులకే రెండు కీలక వికెట్లను ఇండియా కోల్పోయింది. స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. ధ్రువ్‌ జురేల్‌ రెండు ఫోర్లతో మెరిపించినా క్రీజులో నిలదొక్కులోకపోయాడు. 11 పరుగులు చేసి ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మొదటి టెస్ట్‌ ఆడుతున్న తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇండియా తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 59 బంతులు ఎదుర్కొన్న నితీశ్‌ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌ తో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 78 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ తో 37 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ 26 పరుగులు, బూమ్రా 8, హర్షిత్‌ రాణా 7 పరుగులు చేశారు. టీమిండియా బ్యాట్స్‌మన్‌లలో పంత్‌ 145 నిమిషాలు, కేఎల్‌ రాహుల్‌ 109 నిమిషాలు, నితీశ్ 87 నిమిషాలు క్రీజ్‌ లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో హాజెల్‌ ఉడ్‌ నాలుగు, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ మార్ష్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో 2.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇండియా స్పీడ్‌ గన్‌, కెప్టెన్‌ జస్ప్రీత్‌ బూమ్రా నాథన్‌ మెక్‌ స్వీనీ ఎల్‌ బీడబ్ల్యూగా పెవిలియన్‌ కు చేర్చాడు.

First Published:  22 Nov 2024 1:16 PM IST
Next Story