Telugu Global
Sports

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ.. ఇక‌పై 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌

ఆస్ట్రేలియా- ఇండియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ తాజా షెడ్యూల్ విడుద‌ల‌యింది.

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ.. ఇక‌పై 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌
X

ఆస్ట్రేలియా- ఇండియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ తాజా షెడ్యూల్ విడుద‌ల‌యింది. న‌వంబ‌ర్ 22న పెర్త్‌లో జ‌రిగే టెస్ట్‌తో ఈ సిరీస్ మొద‌లవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గా ఉన్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ)ని ఈ ఏడాది నుంచి 5 మ్యాచ్‌ల సిరీస్‌గా మార్చారు. ఇక‌పై బీజీటీలో 5 మ్యాచ్‌ల సిరీస్‌లే ఉంటాయి.

ఇదీ షెడ్యూల్

తొలి టెస్టు: నవంబర్ 22 - 26 , పెర్త్

రెండో టెస్టు (డే అండ్ నైట్‌): డిసెంబరు 6 - 10

మూడో టెస్టు: డిసెంబరు 14 -18, బ్రిస్బేన్

నాలుగో టెస్టు: డిసెంబరు 26 - 30, మెల్బోర్న్

ఐదో టెస్టు: జనవరి 3- 7, సిడ్నీ

యాషెస్ అంత క్రేజ్‌

టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రిగే యాషెస్ సిరీస్‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. యాషెస్‌లో గెలుపెవ‌రిద‌ని క్రికెట్ ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటుంది. అంతటి క్రేజ్‌ను గ‌త 20 ఏళ్లుగా ఇండియా - ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌రిగే బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ కూడా సొంతం చేసుకుంది.

First Published:  26 March 2024 2:39 PM
Next Story