ఈడీ విచారణకు హాజరైన అజహరుద్దీన్
హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు
BY Raju Asari8 Oct 2024 6:51 AM GMT
X
Raju Asari Updated On: 8 Oct 2024 6:51 AM GMT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజాహరుద్దీన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజాహరుద్దీన్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలని అన్నారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story