445 రన్స్ కు ఆస్ట్రేలియా ఆల్ ఔట్
40 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
BY Naveen Kamera16 Dec 2024 6:56 AM IST
X
Naveen Kamera Updated On: 16 Dec 2024 6:56 AM IST
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న మూడో టెస్ట్ మూడో రోజు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఆల్ ఔట్ అయ్యింది. మొదటి రోజు మొత్తం వర్షం కారణంగా ఆట ఎక్కువ సేపు సాగలేదు. ఓవర్ నైట్ స్కోర్ ఏడు వికెట్లకు 405 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు మరో 40 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లో జస్ప్రీత్ బూమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. హెడ్ 152 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ 70, ప్యాట్ కమిన్స్ 20, మిచెల్ మార్ష్ 18 పరుగులతో రాణించారు.
Next Story