తొలి వన్డేలో ఆసీస్ విజయం
భారత్ నిర్దేశించిన 101 రన్స్ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించింది. 101 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. జార్జియా వోల్ (46 నాటౌట్), లిచ్‌ఫీల్డ్ 35 రన్స్ చేశారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 3 వికెట్లు, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నది. కేవలం 100 రన్స్‌కే ఆలౌటైంది. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ (5/19) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడిగ్స్ (23) టాప్ స్కోరర్. ఆమెతో పాటు హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఓపెనర్లు ప్రియా పునియా 3, స్మృతీ మంధాన 8, దీప్తి శర్మ 1, సైమా ఠాకూర్ 4, టిటాస్ సధు 2 రన్స్ చేశారు. ఆసీస్ బౌలర్ల లో స్కట్‌కు 5 వికెట్లు, కిమ్ గార్త్, గార్డెనర్, సదర్లాండ్, అలానా కింగ్ చెరో వికెట్ తీశారు.