ఇండియా ఓడిపోతే వాళ్ల భార్యాపిల్లలేం చేశారు?
మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను దుర్భాషలాడుతూ కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సేజులు పెట్టారు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలవడంతో కొందరు భారత అభిమానులు రెచ్చిపోయారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, వారి భార్యలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. భారత్‌పై 137 పరుగులతో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు ఇండియన్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. నీ భార్యాపిల్లల్ని రేప్ చేసి చంపేస్తామని కొందరు సోషల్ మీడియాలో బెదిరించడం సంచలనంగా మారింది.
మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను దుర్భాషలాడుతూ కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సేజులు పెట్టారు. భారతీయ మూలాలున్న మీరు ఆస్ట్రేలియాకు మద్దతివ్వటం ఏంటని ట్రోల్స్ చేశారు. భారత్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌ను ఖండించారు విని రామన్. ఎవరెవరైతే ఆమెతో అసభ్యంగా మాట్లాడారో వారి చాట్‌ను స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
"నేను భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిని అయ్యి ఉండోచ్చు. కానీ, నేను పుట్టింది, పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. ముఖ్యంగా నా భర్త, నా బిడ్డకు తండ్రి ఆడుతున్న జట్టు ఆస్ట్రేలియా. ఆ జట్టుకు మద్దతివ్వడానికి ఆలోచించాల్సిన పనేలేదు. దేశాల మధ్య బేధాలను మామీద రుద్దకండి" అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు విని రామన్.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ల విషయంలోనే ఇలా జరగలేదు. భారత్ ఫ్యాన్స్ గతంలో మహేంద్రసింగ్ ధోని భార్య, కూతురుపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ భార్య అనుష్కశర్మను కూడా టార్గెట్ చేశారు. భారత్ అభిమానుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.