అహ్మదాబాద్ వన్‌డేలో ఇంగ్లండ్ టార్గెట్ 357 రన్స్
50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయిన టీమ్ ఇండియా
![అహ్మదాబాద్ వన్‌డేలో ఇంగ్లండ్ టార్గెట్ 357 రన్స్ అహ్మదాబాద్ వన్‌డేలో ఇంగ్లండ్ టార్గెట్ 357 రన్స్](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402803-india-ahmedabad-odi.webp)
ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న మూడో వన్‌డేలో ఇంగ్లండ్ జట్టు ముందు టీమ్ ఇండియా భారీ టార్గెట్ పెట్టింది. భారత బ్యాట్స్‌మన్లు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ టీమ్ ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపింది. కానీ ఆ ఆనందం ఇంగ్లండ్‌కు ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కింగ్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసి కోహ్లీ ఔట్ అయ్యాడు. గిల్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 112 పరుగులు చేసిన గిల్ ను రషీద్ బౌల్డ్ చేశాడు. ధాటిగా ఆడిన శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 78 పరుగులు, కేఎల్ రాహుల్ 29 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్ తో 40 పరుగులు చేసి ఔటయ్యారు. హార్థిక్ పాండ్యా 9 బంతుల్లో 17, వాషింగ్టన్ సుందర్ 14, హర్షిత్ రాణా 13 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2, షకిబ్, అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.