అడిలైడ్ టెస్ట్.. రెండు వికెట్లు పడగొట్టిన బూమ్రా
45 ఓవర్లలో మూడు వికెట్లకు 122 పరుగులు చేసిన ఆసీస్
BY Naveen Kamera7 Dec 2024 10:32 AM IST
X
Naveen Kamera Updated On: 7 Dec 2024 10:32 AM IST
అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు (శనివారం) ఫస్ట్ సెషన్‌లో ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా నిప్పులు చెరిగే బంతులతో రెండు వికెట్లను నేలకూల్చాడు. ఆస్ట్రేలియా జట్టు 45 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 86/1 వద్ద ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌లు మెక్‌స్వీని, లబుషేన్ శనివారం ఇన్నింగ్స్ ఆరంభించారు. జట్టు స్కోర్‌కు మరో ఐదు పరుగులు జోడించిన తర్వాత బూమ్రా బౌలింగ్‌లో మెక్‌స్వీని కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే స్టీవ్ స్మిత్ ను బూమ్రా పెవిలియన్‌కు పంపించాడు. బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. మెక్‌స్వీని 39 పరుగులు చేసి ఔట్ కాగా.. లబుషేన్ 42, ట్రావిస్ హెడ్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Next Story