అడిలైడ్ టెస్టు మొదటి రోజు ఆటలో అన్నింటా ఆస్ట్రేలియా ఆదిపత్యం ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా నిర్వహిస్తున్న పింక్ బాల్ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇండియా తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఖాతా తెరవకముందే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 42, కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్ గిల్ 31, రవిచంద్రన్ అశ్విన్ 22, రిషబ్ పంత్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు, పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. నాథన్ మెక్ స్వీని 38, లబుషేన్ 20 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Previous Articleరేవంత్ ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారు : ఈటల రాజేందర్
Next Article మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం
Keep Reading
Add A Comment