అడిలైడ్ టెస్ట్.. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆదిక్యంలో ఆస్ట్రేలియా
ఫస్ట్ సెషన్‌లో నాలుగు వికెట్లకు 191 పరుగులు
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ రెండో రోజు (శనివారం) ఫస్ట్ సెషన్‌లో ఆస్ట్రేలియా ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. ఓవర్‌నైట్ స్కోర్ 86/1 తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా డిన్నర్ టైమ్ కు ఇంకో మూడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా వెంట వెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో ఊపుమీదున్న లబుషేన్‌ను నితీశ్ కుమార్ రెడ్డి ఔట్ చేశారు. ట్రావిస్ హెడ్ 53 పరుగులు, మిచెల్ మార్ష్ 2 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు, నితీశ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 59 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత్ పై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆదిక్యంలో ఉంది. శుక్రవారం టాస్ గెలిచిన బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది.