లంచ్ బ్రేక్ సమయానికి 299 రన్స్ లీడ్‌లో కివీస్
అదరగొట్టిన రచిన్ రవీంద్ర, కాన్వే
BY Raju Asari18 Oct 2024 11:53 AM IST

X
Raju Asari Updated On: 18 Oct 2024 12:25 PM IST
భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నది. మొదటి ఇన్సింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 345-7 రన్స్ చేసింది. 299 పరుగుల లీడ్‌లో ఉన్నది. రచిన్ రవీంద్ర (104 నాటౌట్), టీమ్ సౌథీ (49 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కాన్వే (91), విల్ యంగ్ (33) రన్స్ చేశారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశాడు. భారత్ మొదటి ఇన్సింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
భారత్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. తొలి టెస్ట్ లో ఇప్పటివరకు 299 ఆధిక్యాన్ని సాధించింది. 12 ఏళ్ల తర్వాత సొంత గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టుకు మొదటి ఇన్సింగ్స్ లీడ్ దక్కడం ఇదే తొలిసారి. చివరి సారి 2012లో ఇంగ్లాండ్ 207 రన్స్ లీడ్ సాధించింది.
Next Story