యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు.. హమ్ చేసి పాట వెతకొచ్చు!
ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఒకటి. యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఒకటి. యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటంటే..
యూట్యూబ్ లో సాంగ్స్‌ను ఈజీగా సెర్చ్ చేసుకునేలా యూట్యూబ్ సాంగ్ సెర్చ్ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు కావాల్సిన పాటను ఈజీగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్లు తమకు కావల్సిన పాట కోసం మైక్ సింబల్‌పై క్లిక్ చేసి మూడు సెకన్లపాటు ట్యూన్‌ను హమ్ చేయాలి. యూట్యూబ్ ఆ పాట లేదా మ్యూజిక్‌ను గుర్తించి, దానికి సంబంధించిన రిజల్ట్స్‌ను చూపిస్తుంది.
2020 లో గూగుల్ తీసుకొచ్చిన హమ్ టు సెర్చ్ ఫీచర్‌ను ఆధారం చేసుకుని యూట్యూబ్ ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు పేర్కొంది. గూగుల్ హమ్ టు సెర్చ్‌లో 15 సెకన్ల పాటు ట్యూన్‌ను హమ్ చేయాలి. అయితే యూట్యూబ్‌లో కేవలం మూడు సెకన్లు హమ్ చేస్తే చాలు.
ఇకపోతే యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా కొంతమంది యాడ్ బ్లాకర్ల వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను వాడుతుంటారు. అయితే రీసెంట్‌గా యూట్యూబ్ దానికి చెక్ పెట్టింది. యాడ్ బ్లాకర్స్ వంటి ఎక్స్‌టెన్షన్లు ఉంటే అసలు వీడియోలే ప్లే అవ్వకుండా సెక్యూరిటీ అప్‌డేట్ చేసింది. యాడ్స్ రాకుండా ఉండేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఒక్కటే ఆప్షన్ అని యూట్యూబ్ చెప్తోంది.