Telugu Global
Science and Technology

యూ ట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు

ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న కొత్త అప్‌డేట్‌

యూ ట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు
X

వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ గురువారం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వీడియో క్రియెటర్స్‌ అక్టోబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 నుంచి మూడు నిమిషాల నిడివి గల షార్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. యూ ట్యూబ్ ప్రస్తుతం 60 సెకండ్ల లోపు వీడియో లను మాత్రమే షార్ట్స్ గా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒక అంశానికి సంబంధించిన అంశాన్ని చాలావరకు కుదించి చెప్పాల్సి వస్తున్నది. దీంతో ఆ షార్ట్స్‌లో సమాచారం ఉంటున్నా అది సమగ్రంగా ఉండటం లేదు.

గతంలో 60 సెకన్ల వీడియోలకే పరిమితం చేయబడిన షార్ట్స్‌ యూట్యూబ్‌ తాజాగా ప్రకటించిన అప్‌డేట్‌ వినియోగించుకుని మరింత క్రియేటివ్‌గా వీడియోలు క్రియేట్‌ చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు అవకాశం చతురస్రం లేదా పొడవుగా ఉండే వీడియోలకే వర్తిస్తుంది. అలాగే అక్టోబర్ 15లోపు అప్‌లోడ్ చేసిన వీడియోలు ఏవీ ప్రభావితం కావు. రాబోయే నెలల్లో పొడవైన షార్ట్స్‌ కోసం సిఫార్సులను మెరుగుపరచడానికి మేము కృషి చేస్తామని కంపెనీ తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. క్రియేటర్‌లు తమ వీడియోలను దీర్ఘకాలంగా ఉంచడానికి ఇష్టపడితే వారు 16:9 నిష్పత్తిలో అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొన్నది.

యూట్యూబ్‌ క్రియేటర్స్‌ కోసం కొత్త ఆప్షన్లను కూడా ప్రకటించింది. మొదటిది రీమిక్స్ . దీనిద్వారా వినియోగదారులు వారి సొంత వీడియోలను క్రియేట్‌ చేయడానికి ఒక టెంప్లేట్‌గా జనాదరణ పొందిన షార్ట్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. రాబోయే నెలల్లో, షార్ట్‌లు ప్లాట్‌ఫారమ్‌లోని వివిధ వీడియోల నుంచి క్లిప్‌లను రీమిక్స్ చేయడాన్ని వినియోగదారులకు సులభతరం చేసే అప్‌డేట్‌ను పొందుతారని యూట్యూబ్ తెలిపింది.

అక్టోబర్ 15 కంటే ముందు అప్‌లోడ్ చేయబడిన 60 సెకన్ల నుండి 3 నిమిషాల మధ్య ఉన్న నిడివి గల వీడియోలను అప్‌లోడ్‌ చేసిన క్రియేటర్స్‌ కోసం ఇవి సాధారణ, దీర్ఘ కంటెంట్‌గా వర్గీకరించబడతాయి. పొడవైన షార్ట్స్‌లో కాపీరైట్ చేయబడిన ఆడియో, విజువల్స్‌ని ఉపయోగించడం గురించి విధానాలను కూడా యూట్యూబ్‌ వివరించింది. కాపీరైట్ చేయబడి 60 సెకన్లకు మించిన మెటీరియల్‌ని కలిగి ఉంటే యూట్యూబ్‌ క్రియేటర్‌ ఛానెల్‌పై ప్రభావం పడకుండా బ్లాక్ చేయబడుతుంది. క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను క్రియేటర్స్‌ తీసివేయాలని సూచించింది.

First Published:  4 Oct 2024 2:37 PM IST
Next Story