Telugu Global
Science and Technology

ఈ ఏడాది బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ ఇవే..

ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా గూగుల్‌ ప్లే ‘బెస్ట్‌ ప్లే 2022’ అవార్డులను ప్రకటించింది. గూగుల్‌ ప్లే ఎడిటోరియల్‌ టీమ్‌ ఈ విన్నర్లను సెలక్ట్ చేసింది.

ఈ ఏడాది బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ ఇవే..
X

ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా గూగుల్‌ ప్లే 'బెస్ట్‌ ప్లే 2022' అవార్డులను ప్రకటించింది. గూగుల్‌ ప్లే ఎడిటోరియల్‌ టీమ్‌ ఈ విన్నర్లను సెలక్ట్ చేసింది. ఈ ఎంపిక కోసం యూజర్ల చాయిస్‌ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇండియాలో బెస్ట్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌, గేమ్స్‌ ఏవంటే..

గూగుల్ ప్లే.. కేటగిరీల వారీగా బెస్ట్ యాప్స్‌ను లిస్ట్ చేసింది. అందులో బెస్ట్ షాపింగ్‌ యాప్‌. యూజర్స్‌ చాయిస్‌ యాప్‌గా 'ఫ్లిప్‌కార్ట్‌' నిలిచింది. ఆ తర్వాత నేవిగేటర్‌ ఫర్‌ లెర్నింగ్‌ యాప్‌గా 'క్వెస్ట్‌', యూజర్స్‌ ఛాయిస్‌ యాప్‌గా 'యాంగ్రీ బర్డ్స్‌ జర్నీ', బెస్ట్ గేమ్‌గా 'ఎపెక్స్‌ లెజెండ్స్‌ మొబైల్‌', బెస్ట్‌ హిడెన్‌ జెమ్స్‌గా' బేబీజి' , బెస్ట్‌ యాప్స్‌ ఫర్‌ గుడ్‌గా 'ఖయాల్‌' అనే - సీనియర్‌ సిటిజెన్‌ యాప్‌, బెస్ట్‌ యాప్‌ ఫర్‌ టాబ్లెట్స్‌గా 'పాకెట్‌', బెస్ట్‌ మల్టిప్లేయర్‌ గేమ్‌గా ' రాకెట్‌ లీగ్‌ సైడ్‌స్వైప్‌' యాప్స్ నిలిచాయి.

ఇకపోతే ఎక్కువ డౌన్‌లోడ్స్ సాధించిన యాప్స్‌లో 'బ్యాండ్‌ల్యాబ్‌' యాప్ ముందుంది. ఇది 'బెస్ట్‌ క్రోమ్‌బుక్స్‌ యాప్‌'గా ఎంపికైంది. ఇది మ్యూజిక్‌ మేకింగ్‌ స్టూడియో యాప్. సోషల్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. దీనికి 5 కోట్లకు మించి యూజర్లు ఉన్నారు.

ఈ ఏడాది 'పాకెట్‌' యాప్‌ను కూడా ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది 'ద బెస్ట్‌ టాబ్లెట్స్‌ యాప్‌' గా నిలిచింది. ఇది రోజులో చేయాల్సిన పనులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. యూజర్‌ యాక్టివిటీ హిస్టరీని బట్టి లేటెస్ట్‌ స్టోరీలు, ఆర్టికల్స్‌, న్యూస్‌, స్పోర్ట్స్‌, వీడియోల వంటివాటిని షేర్ చేస్తుంది.

First Published:  31 Dec 2022 6:30 PM IST
Next Story