Telugu Global
Science and Technology

Redmi 13C 5G | 50-మెగాపిక్సెల్స్ కెమెరాతో రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌.. ఎంట్రీ లెవెల్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే.. ఇవీ డిటైల్స్‌

Redmi 13C 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్‌మీ త‌న రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Redmi 13C 5G | 50-మెగాపిక్సెల్స్ కెమెరాతో రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌.. ఎంట్రీ లెవెల్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే.. ఇవీ డిటైల్స్‌
X

Redmi 13C 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్‌మీ త‌న రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. ఆరు నెల‌ల క్రిత‌మే రెడ్‌మీ12సీ (Redmi 12C) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా ఆవిష్క‌రించిన రెడ్‌మీ13సీ 5జీ (Redmi 13C 5G) భారీ అప్‌డేట్స్‌తో వ‌స్తోంది. అంతేకాదు.. షియోమీ (Xiaomi) భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన ఎంట్రీ లెవ‌ల్ బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల‌లో అతి త‌క్కువ ధ‌ర‌కే రెడ్‌మీ13సీ 5జీ (Redmi 13C 5G) అందుబాటులో ఉంటుంది. అంతేకాదు షియోమీ త‌న రెడ్‌మీ13సీ 4జీ వ‌ర్ష‌న్ రెడ్‌మీ13సీ (Redmi 13C) కూడా మార్కెట్‌లో తెచ్చింది.

రెడ్‌మీ13సీ 5జీ (Redmi 13C 5G), రెడ్‌మీ 13సీ (Redmi 13C) ఫోన్లు ఫోన్ మూడు ర్యామ్‌ల వేరియంట్ల‌లో ల‌భిస్తాయి. రెడ్‌మీ13సీ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.9,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,499, 8 జీబీ ర్యామ్ విత్ 256జీబీ ఇంట‌ర్న‌ల్ వేరియంట్ రూ.13,499 ల‌కు ల‌భిస్తుంది. రెడ్‌మీ13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్ స్టార్ట్‌రెయిల్ సిల్వ‌ర్‌, స్టార్ట్‌రెయిల్ గ్రీన్‌, స్టార్ లైట్ బ్లాక్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

రెడ్‌మీ13సీ 4జీ (Redmi 13C 4G) ఫోన్ కూడా మూడు ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. రెడ్‌మీ13సీ 4జీ ((Redmi 13C 4G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ వేరియంట్ రూ. 7,999, 6 జీబీ ర్యామ్ విత్‌ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 8 జీబీ ర్యామ్ విత్‌ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499 ల‌కు ల‌భిస్తుంది. ఈ ఫోన్ నాలుగు క‌ల‌ర్స్ - స్టార్‌డ‌స్ట్ బ్లాక్‌, స్టార్ షైన్ గ్రీన్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ నెల 12 నుంచి రెడ్‌మీ 13సీ 4జీ (Redmi 13C 4G) ఫోన్, ఈ నెల 16 నుంచి రెడ్‌మీ13సీ 5జీ ఫోన్ల విక్ర‌యాలు ప్రారంభం అవుతాయి. ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఇత‌ర ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ల‌లో ఈ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు.

రెడ్‌మీ13సీ 5జీ.. రెడ్‌మీ13సీ స్పెషిఫికేష‌న్స్‌.. ఫీచ‌ర్లు..

రెడ్‌మీ13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 180 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీ+ (1,600 x 720 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వ‌ర్ష‌న్‌పై ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ ఎస్వోసీ (MediaTek Dimensity 6100+ SoC) చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చ‌ర్‌, పొర్ట్రైట్ మోడ్‌లో వినియోగిస్తున్న‌ప్పుడు సెకండ్ కెమెరా డెప్త్ డేటా సేక‌రిస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం టాప్‌డిస్‌ప్లేలో యూ-షేప్డ్ ఎంబీడెడ్‌ 5-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

18వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. బాక్స్‌తోపాటు 10 వాట్ల చార్జ‌ర్ కూడా వ‌స్తుంది. వై-ఫై ఏసీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్‌, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుందీ రెడ్‌మీ13సీ 5జీ ఫోన్‌.

రెడ్‌మీ13సీ స్పెషిఫికేష‌న్స్‌.. ఫీచ‌ర్లు ఇవే

రెడ్‌మీ13సీ (Redmi 13C) 4జీ ఫోన్‌ 6.74-అంగుళాల హెచ్‌డీ+ (1,600 x 720 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ డాట్ డ్రాప్ డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వ‌స్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. డ్య‌య‌ల్ సిమ్‌తోపాటు మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మీడియా హెలియో జీ85 ఎస్వోసీ (MediaTek Helio G85 SoC) చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, డెప్త్ డేటా గేద‌రింగ్ కోసం థ‌ర్డ్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. 18 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. దీంతోపాటు 10వాట్ల చార్జ‌ర్ కూడా బాక్స్‌లో ఉంటుంది. డ్యుయ‌ల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్‌, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

First Published:  7 Dec 2023 9:00 AM IST
Next Story