Telugu Global
Science and Technology

డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. ఆన్‌లైన్ లెర్నింగ్.. ఏది ఎంచుకోవాలి?

డెస్టెన్స్, ఆన్‌లైన్ ఈ రెండు విధానాల్లో కొన్ని ప్రయోజనాలు, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. ఆన్‌లైన్ లెర్నింగ్.. ఏది ఎంచుకోవాలి?
X

డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. ఆన్‌లైన్ లెర్నింగ్.. ఏది ఎంచుకోవాలి?

కాలేజీకి వెళ్లకుండానే చదువుకునే మార్గాల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఆప్షన్. అయితే ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అనే మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. కోర్సులు చేసేందుకు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం

డెస్టెన్స్, ఆన్‌లైన్ ఈ రెండు విధానాల్లో కొన్ని ప్రయోజనాలు, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి ఉన్నత చదువుల కోరికను నెరవేర్చుకోవచ్చు. మాస్టర్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇలా.. అన్ని రకాల కోర్సులు పూర్తి చేయొచ్చు. తక్కువ ఖర్చుతో డిగ్రీ పట్టా పొందొచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా చదువుకునే వీలుంటుంది. రెగ్యులర్ విధానంతో పోల్చితే కోర్సు ఎలిజిబిలిటీలో వెసులుబాటు ఉంటుంది. ఏజ్ లిమిట్ ఉండదు.

ఇక నెగెటివ్స్ విషయానికొస్తే.. డిస్టెన్స్ విధానంలో స్పెషలైజేషన్లు తక్కువ. కోర్సుకు సంబంధించి రియల్ టైం ఎక్స్‌పోజర్ ఉండదు. ప్రాక్టికల్స్, ల్యాబ్స్ లాంటి వాటికి అవకాశం ఉండదు. ప్లేస్‌మెంట్ అవకాశాలు తక్కువ.

ఆన్‌లైన్ లెర్నింగ్

ఆన్‌లైన్ లెర్నింగ్ అనేది రీసెంట్‌గా వచ్చిన మోడల్. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, రెగ్యులర్ కోర్సు కిందకే వస్తుంది. అయితే టీచింగ్ మోడ్ ఆన్‌లైన్ ద్వారా సాగుతుంది. ఒకరకంగా ఇవి ఆన్‌లైన్ క్లాసుల్లాంటివి. ఆన్‌లైన్ కోర్సును ఎంచుకున్నవారు ఇంట్లోనే కూర్చుని మొబైల్ ద్వారా కోర్సును పూర్తి చేయొచ్చు. ఈ రకమైన కోర్సులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటోంది. ఎంబీఏ, పీజీడీఎం, ఎంటెక్ వంటి కోర్సులను కూడా ఆన్‌లైన్ ద్వారా చేసేయొచ్చు. ఆన్‌లైన్ కోర్సులకు ఇప్పటి యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనిద్వారా నాణ్యమైన విద్యతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా లభిస్తోంది. కాలేజికి వెళ్లి చదివడం ద్వారా అయ్యే ఖర్చుతో పోలిస్తే ఆన్‌లైన్ మోడ్‌లో అయ్యే ఖర్చు తక్కువ .

First Published:  15 Jun 2023 10:45 AM IST
Next Story