Jio Air Fiber | జియో ఎయిర్ ఫైబర్‌తో బెనిఫిట్లు ఇలా.. మెట్రో నగరాల్లో ఎయిర్‌టెల్ సేవలివి..!
Jio Air Fiber | రిలయన్స్ జియో ఒక సంచలనం.. 2016లో దేశంలో 4జీ సేవలు ప్రారంభించినప్పటి నుంచి జియో కస్టమర్లకు చేరువయ్యేందుకు అనునిత్యం అనూహ్యంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది.
Jio Air Fiber | రిలయన్స్ జియో ఒక సంచలనం.. 2016లో దేశంలో 4జీ సేవలు ప్రారంభించినప్పటి నుంచి జియో కస్టమర్లకు చేరువయ్యేందుకు అనునిత్యం అనూహ్యంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది. తాజాగా ఇటీవల జరిగిన రిలయన్స్ 46వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో మరో కీలక నిర్ణయం ప్రకటించారు ముకేశ్ అంబానీ.. అదే రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ (Reliance Jio Air Fiber). గణేశ్ చతుర్థి నాడు (సెప్టెంబర్ 19) `జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber)` ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతేడాది జియో ఫైబర్ (Jio Fiber) తీసుకొచ్చారు. జియో ఫైబర్ (Jio Fiber), జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) మధ్య తేడా ఏమిటి? నూతన జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) ఎలా పని చేస్తుంది. యూజర్లకు దాని ప్రయోజనాలేమిటి? తెలుసుకుందాం..!
ఫైబర్ ఆప్టిక్ వైర్ టెక్నాలజీ ఆధారంగా ఏర్పాటైంది జియో ఫైబర్ (Jio Fiber). ఇల్లు లేదా ఆఫీసులో రిలయన్స్ జియో రూటర్ ఇన్‌స్టల్ చేస్తుంది. రూటర్‌కు ఆప్టిక్ వైర్ కనెక్ట్ చేస్తారు. అటుపై ఫైబర్ నెట్‌వర్క్ స్థిరమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. కానీ, దీనికి ప్రాథమిక మౌలిక వసతులు అవసరం. జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) ద్వారా రిలయన్స్ జియో.. తన యూజర్లకు వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ అందిస్తుంది. వైర్‌లెస్ కంప్యూటర్‌గా కనిపిస్తున్నా శరవేగంగా ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. దీనికి ఎటువంటి మౌలిక వసతులు అవసరం లేదు. రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ ((Jio Air Fiber) వల్ల మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ తేలిగ్గా లభిస్తుంది.
ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, ఇతర కంపెనీలకు ఫైబర్ ఆధారిత ఆప్టిక్ వైర్ టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం. కానీ ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber)తో ఎటువంటి వైర్ లేకుండానే ఇంటర్నెట్ అందించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు ఎయిర్ ఫైబర్ ద్వారా తేలిగ్గా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తేవచ్చు.
ఎయిర్ ఫైబర్ డివైజ్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్లే పోర్టబిలిటీ ఉంటుంది. యూజర్లు సదరు ఎయిర్ ఫైబర్ డివైజ్‌ను ఎప్పుడైనా, ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లి ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. ఆయా ప్రాంతాల్లో 5జీ కనెక్టివిటీ అందుబాటులో ఉండాలి. రిలయన్స్ జియో తెలిపిన వివరాల ప్రకారం జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) సాయంతో బ్రాడ్‌బాండ్ తరహాలో స్పీడ్ ఇంటర్నెట్ పొందొచ్చు.
ఢిల్లీ, ముంబై నగరాల్లో మూడు వారాల క్రితమే భారతీ ఎయిర్‌టెల్ తన ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్ (Airtel Xtreme Air Fiber) సేవలు ప్రారంభించింది. వై-ఫై 5 రూటర్ కంటే ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్‌తో 50 శాతం వేగంగా ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.