మొబైల్ స్క్రీన్‌పై గూగుల్ సెర్చ్ సర్కిల్! ఎలా పని చేస్తుందంటే..
మొబైల్ వాడుతున్నప్పుడు సడెన్‌గా ఏదైనా విషయంపై గూగుల్ సెర్చ్ చేయాలంటే యాప్ నుంచి బయటకు వచ్చి గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ యాప్‌లోకి వెళ్లాలి. ఇకపై ఆ అవసరం లేకుండా ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఫీచర్ రాబోతోంది.
ఎప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ సెర్చ్ చేసేయడం అలవాటు చాలామందికి. అయితే గూగుల్ సెర్చ్‌కు సంబంధించి ఓ మేజర్ అప్‌డేట్‌ను ప్రకటించింది గూగుల్. గూగుల్ సెర్చ్‌ను మరింత ఈజీ చేసేలా ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఫీచర్ తీసుకురానుంది.
మొబైల్ వాడుతున్నప్పుడు సడెన్‌గా ఏదైనా విషయంపై గూగుల్ సెర్చ్ చేయాలంటే యాప్ నుంచి బయటకు వచ్చి గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ యాప్‌లోకి వెళ్లాలి. ఇకపై ఆ అవసరం లేకుండా ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఫీచర్ రాబోతోంది. ఇదెలా ఉంటుందంటే..
మొబైల్‌లో ఎప్పుడైనా ఈజీగా గూగుల్ సెర్చ్ చేసేందుకు వీలుగా ఈ సర్కిల్ ఫీచర్ ఉండబోతోంది. యాప్‌ల నుంచి స్విచ్ కాకుండానే యూజర్లు చిన్న ఐకాన్ ద్వారా గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. చేస్తున్న పని నుంచి డిస్టర్బ్ అవ్వకుండానే కావాల్సిన సమాచారాన్ని పొందడం ఈ ఫీచర్ ప్రత్యేకత. ఉదాహరణకు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అందులోని యాక్టర్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే బ్యాక్‌కు వచ్చే పనిలేకుండా స్క్రీన్‌పై కనిపించే సర్కిల్‌పై క్లిక్ చేసి గూగుల్ సెర్చ్ చేసేయొచ్చు.
గూగుల్ సర్కిల్ టు సెర్చ్ అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో సర్కిలింగ్, హైలైటింగ్, స్ర్కిబ్లింగ్, టాపింగ్ వంటి పలు టూల్స్ ఉన్నాయి. హోం బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ సెర్చ్‌కు ఏఐ పవర్డ్ రిజల్ట్స్ కూడా జత చేసి ఉంటాయి. అంటే ఛాట్ జీపీటీ మాదిరిగా సెర్చ్ చేసిన టాపిక్ గురించిన పూర్తి వివరాలు ఏఐ సెర్చ్ రిజల్ట్స్ రూపంలో కనిపిస్తాయి. అంతేకాకుండా ఇందులో టెక్స్ట్‌తో పాటు ఇమేజెస్, స్ర్కీన్‌షాట్స్ వంటి వాటితో కూడా సెర్చ్ చేసుకునే వీలుంటుంది.
ఈ కొత్త ఫీచర్ జనవరి నెలాఖరు నుంచి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫీచర్ ముందుగా గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని మొబైల్స్‌కు అందుబాటులోకి వస్తుంది.