Telugu Global
Science and Technology

అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా?

అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా? అద్దానికి రంగు ఏంటి? అనుకుంటున్నారా?

What color is a mirror: అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా?
X

అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా?

అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా? అద్దానికి రంగు ఏంటి? అనుకుంటున్నారా? కానీ, ఫిజిక్స్‌ ప్రకారం అద్దానికి కూడా రంగు ఉందట.

అద్దంలో కేవలం ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. దాని ఎదురుగా ఏ రంగు ఉంటే అదే రంగు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే అద్దానికి ఎలాంటి రంగు ఉండదు అనుకుంటారు చాలామంది. కానీ, ఫిజిక్స్ ప్రకారం అద్దానికి కూడా ఓ రంగు ఉంది. అదే ఆకుపచ్చ. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆప్టికల్ ఫిజిక్స్ ఆధారంగా అద్దం ఒరిజినల్ కలర్ గ్రీన్. అయితే అద్దం మీద లైట్ పడిన వెంటనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దాని రంగుని మనం గుర్తించలేం.

అద్దం రంగుని కనిపెట్టడం కోసం 2004లో స్పెయిన్‌లో రేమండ్ లీ, జేవియర్ హెర్నాండెజ్ అనే సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. రెండు అద్దాలను ఎదురెదురుగా అమర్చి, ఒక మిర్రర్ టన్నెల్ తయారుచేశారు. ఈ టన్నెల్‌లోకి లైట్ పంపితే అది రెండు అద్దాల మధ్య కొన్ని వేల సార్లు అటు ఇటు రిఫ్లె్క్ట్ అయింది. ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు గ్రీన్ కలర్ వేవ్ రావడం గుర్తించారు సైంటిస్టులు. అలా అద్దం రంగు గ్రీన్ అని కన్ఫర్మ్ చేశారు. అంతెందుకు సిలికా గ్లాస్ లేదా గాజుగ్లాస్ లాంటివి బాగా పాతవైనప్పుడు అవి లేత ఆకుపచ్చరంగులోకి మారడాన్ని మనం కూడా గమనించొచ్చు.

First Published:  24 March 2023 3:15 PM IST
Next Story