Telugu Global
Science and Technology

ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం కార్పొరేట్ కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.

ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!
X

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో రాణించాలనుకునేవాళ్లు దానికి తగ్గట్టుగా ఇప్పట్నుంచే స్కిల్స్‌పై ఫోకస్ పెట్టాలి. ఏఐ రంగంలో ధీటుగా రాణించేందుకు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ తప్పక తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం కార్పొరేట్ కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులకు అసలు ఏఐ గురించిన మినిమమ్ నాలెడ్జి లేదని స్టడీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐతో పనిచేయించే ప్రాంప్ట్ ఇంజినీర్లకు డిమాండ్ పెరుగుతోంది.

ఏఐ అనేది సొంతంగా ఆలోచించి పని చేయగలిగే టూల్. అడిగిన విషయాన్ని బట్టి, ఇచ్చిన కోడ్‌ను బట్టి రిజల్ట్ ఉంటుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత కచ్చితంగా ఉంటే రిజల్ట్ అంత స్పష్టంగా ఉంటుంది. ప్రాంప్ట్స్ అనేది ఏఐ టూల్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం. ఇలాంటి ప్రాంప్ట్‌లను డెవలప్ చేసేవారినే ప్రాంప్ట్ ఇంజినీర్లు అంటారు.

ప్రాంప్ట్ ఇంజనీర్లను ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లుగా కూడా వర్ణించొచ్చు. సంస్థలు ఏఐ టూల్స్ వాడాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇంజినీర్ తప్పక ఉండాలి. ఇది పూర్తిగా టెక్నికల్ స్కిల్, టెక్నికల్ నాలెడ్జితో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజీపై కూడా పట్టు ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రాంప్ట్ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉండబోతోందని పలు జాబ్ పోర్టళ్లు చెప్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ స్కిల్స్ ను కోర్సుల రూపంలో కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ రంగంలో రాణించాలనుకుంటే డిగ్రీలతో పాటు ఈ తరహా స్కిల్స్‌పై కాస్త పట్టు సాధిస్తే కెరీర్‌‌కు ఢోకా ఉండదు.

First Published:  21 Jun 2024 8:00 AM IST
Next Story