Telugu Global
Science and Technology

Vivo Y58 5G | వివో నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్ `వివో వై58 5జీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌రెంతంటే..!

Vivo Y58 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Vivo Y58 5G | వివో నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్ `వివో వై58 5జీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌రెంతంటే..!
X

Vivo Y58 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరాతో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న వివో వై58 5జీ పోన్ రెండు రంగుల్లో ల‌భిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తోంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ క‌లిగి ఉంది.

వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,499ల‌కు ల‌భిస్తుంది. హిమాల‌య‌న్ బ్లూ, సుంద‌ర్‌బాన్స్‌ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. వివో ఇండియా ఈ-స్టోర్‌తోపాటు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ సంస్థ‌లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ద్వారా విక్ర‌యాలు జ‌రుగుతాయి. దేశంలోని అన్ని రిటైల్ స్టోర్ల‌లోను అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ కార్డ్‌, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండ‌స్ఇండ్ బ్యాంకు కార్డుల‌పై కొనుగోలు చేసిన వారికి రూ.1,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1024 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,408 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ స్క్రీన్ క‌లిగి ఉంటుంది. 2.5 డీ స్క్రీన్ టీయూవీ రెయిన్‌లాండ్ లో బ్లూ లైట్ ఐ కేర్ స‌ర్టిఫికేష‌న్ క‌లిగి ఉంటుంది. 4ఎన్ఎం స్నాప్ డ్రాగ‌న్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తోపాటు 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కూ పెంచుకోవ‌చ్చు.

వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ ఎఫ్‌/ 1.8 అపెర్చ‌ర్‌తోపాటు 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరా, ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ అండ్ డ్యుయ‌ల్ ఫ్లాష్‌తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

జీపీఎస్‌, బైదూ, గ్లోనాస్‌, గెలీలియో, క్యూజ‌డ్ఎస్ఎస్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుందీ వివో వై58 5జీ ఫోన్‌. యాక్సెల‌రో మీట‌ర్‌, అంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, ఐఆర్ కంట్రోల్‌, గైరోస్కోప్ వంటి సెన్స‌ర్లు ఉంటాయి. వివో వై58 5జీ ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ క‌లిగి ఉంటుంది. డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్ల‌తో వ‌స్తున్న ఈ ఫోన్ డస్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ అందుకుంది.

వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. సింగిల్ చార్జింగ్ తో 73 గంట‌లు మ్యాజిక్ ప్లే బ్యాక్‌, 23 గంట‌లు యూ-ట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ టైం క‌లిసి వ‌స్తుంది. ఫోన్ ఐదు నిమిసాలు వాడితే 2.8 గంట‌ల పాటు టాక్‌టైం ఇవ్వ‌వ‌చ్చు. నాలుగేండ్ల బ్యాట‌రీ సెక్యూరిటీకి గ్యారంటీ ఇస్తోంది వివో వై58 5జీ ఫోన్‌.

First Published:  22 Jun 2024 7:18 AM GMT
Next Story