Telugu Global
Science and Technology

Vivo V30 4G | గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో వివో వీ30 లైట్ 4జీ ఆవిష్క‌ర‌ణ‌.. త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లోకి..?!

Vivo V30 4G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వీ సిరీస్ ఫోన్‌.. వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G).. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Vivo V30 4G | గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో వివో వీ30 లైట్ 4జీ ఆవిష్క‌ర‌ణ‌.. త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లోకి..?!
X

Vivo V30 4G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వీ సిరీస్ ఫోన్‌.. వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G).. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. నాలుగు నెల‌ల క్రిత‌మే వివో వీ30 లైట్ 5జీ (Vivo V30 Lite 5G) ఫోన్‌ను గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుతం ఆవిష్క‌రించిన‌ వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G) ఫోన్.. స్నాప్‌డ్రాగ‌న్ 685 చిప్‌సెట్‌తో రావ‌డంతోపాటు ఆండ్రాయిడ్ 14 బేస్డ్‌ ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ క‌లిగి ఉంటుంది. 80 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G) ఫోన్ ధ‌ర సుమారు రూ.22,510 (24,999 రూబుల్స్‌) ప‌లుకుతుంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో ల‌భ్యం అవుతున్న వివో వీ30 లైట్ 4జీ ఫోన్ క్రిస్ట‌లైన్ బ్లాక్‌, సెరైన్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీతో వ‌స్తుంది. భార‌త్‌తోపాటు ఇత‌ర మార్కెట్ల‌లో త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌డానికి ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోందీ వివో.

వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫ‌న్ ట‌చ్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ (Android 14-based Funtouch OS 14 out-of-the-box) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67- అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,400 పిక్సెల్స్‌) ఈ4 అమోలెడ్ స్క్రీన్‌తో వ‌స్తున్న‌ది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 685 చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది.

వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G) ఫోన్ ఎల‌క్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (electronic image stabilisation -EIS)తోపాటు 50- మెగా పిక్సెల్ రేర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్‌ 2-మెగా పిక్సెల్ కెమెరాతో వ‌స్తున్న‌ది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా కూడా ఉంట‌ది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ క‌లిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంట‌ది.

First Published:  8 April 2024 8:09 AM IST
Next Story