Telugu Global
Science and Technology

Vivo T3 5G | వివో టీ3 5జీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Vivo T3 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో టీ3 5జీ ఫోన్‌ను ఈ నెల 21 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Vivo T3 5G | వివో టీ3 5జీ ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Vivo T3 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో టీ3 5జీ ఫోన్‌ను ఈ నెల 21 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 14 వ‌ర్ష‌న్‌తో వ‌స్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, దేశంలోని రిటైల్ స్టోర్ల‌లో కొనుగోలు చేయొచ్చు. కాస్మిక్ బ్లూ, క్రిస్ట‌ల్ ఫ్లేక్ రంగుల ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది.

వివో టీ3 5జీ ఫోన్.. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే ఒక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ ప్రాసెస‌ర్ ఉంటుంద‌ని భావిస్తున్నారు.

వివో టీ3 5జీ ఫోన్.. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్ల‌లో వ‌స్తుంది. వ‌ర్చువ‌ల్‌గా ఫోన్ ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ సామ‌ర్థ్యం పెంచుకోవ‌చ్చు. బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరా 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ బొకెహ్ లెన్స్ విత్ ఫ్లిక్క‌ర్ సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

వివో టీ3 5జీ ఫోన్ 44 వాట్ల ఫ్లాష్ చార్జ్ టెక్నాల‌జీతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్లు, ఐపీ54 రేటింగ్ ఫ‌ర్ డ్యూర‌బిలిటీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. దీని ధ‌ర సుమారు రూ.20 వేలు ఉండొచ్చున‌ని తెలుస్తున్న‌ది.

First Published:  16 March 2024 3:43 PM IST
Next Story