Telugu Global
Science and Technology

ట్విటర్ vs త్రెడ్స్.. తేడా ఇదే..

ట్విటర్‌‌‌‌కు పోటీగా ఫేస్​బుక్​ సీఈవో మార్క్‌‌ జూకర్‌‌‌‌బర్గ్‌ తీసుకొచ్చిన‌ ‘త్రెడ్స్‌’‌ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది.

ట్విటర్ vs త్రెడ్స్.. తేడా ఇదే..
X

ట్విటర్ vs త్రెడ్స్.. తేడా ఇదే..

ట్విటర్‌‌‌‌కు పోటీగా ఫేస్​బుక్​ సీఈవో మార్క్‌‌ జూకర్‌‌‌‌బర్గ్‌ తీసుకొచ్చిన‌ ‘త్రెడ్స్‌’‌ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది. లాంచ్ చేసిన రోజులోనే మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎలా ఉండబోతోంది? ఇది ట్విటర్‌‌కు ఎలాంటి పోటీనిస్తుంది?

ట్విటర్‌‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేశాక యూజర్లకు రకరకాల సమస్యలు వచ్చిపడ్డాయి. బ్లూటిక్స్, లిమిటెడ్ వ్యూస్.. ఇలా ట్విటర్‌‌లో రకరకాల మార్పులొచ్చాయి. మస్క్ నిర్ణయాల వల్ల చాలామంది స్పాన్సర్లు, అడ్వర్టయిజర్లు ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యారు. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మార్క్ జూకర్ బర్గ్.. ట్విటర్‌‌కు ఆల్టర్నేటివ్ తీసుకురావాలనుకున్నాడు. అందుకే ట్విటర్ తరహాలో త్రెడ్స్ యాప్‌ను లాంఛ్ చేశాడు. వంద కోట్లకు పైగా యూజర్లు వాడుకునేలా ఓ కన్వర్జేషన్ యాప్ ఉండడం అవసరమని, ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆ అవకాశం వచ్చినా వాడుకోలేకపోయిందని తన త్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు, కన్వర్జేషన్ యాప్‌గా ట్విటర్ ఫెయిల్ అయిందని, త్రెడ్స్ సాధించి చూపిస్తుందని అన్నాడు.

ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, త్రెడ్స్‌.. ఈ రెండు ఒకేలాంటి యాప్స్ అయినా ఫీచర్స్ విషయంలో వీటి మధ్య చాలా తేడాలున్నాయి. త్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెరిఫైడ్ అకౌంట్స్.. 500 క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకే పోస్ట్ చేయడానికి ఉంటుంది. అదే వెరిఫై కాని అకౌంట్స్.. 280 క్యారెక్టర్ల వరకు పోస్ట్ చేయొచ్చు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లూ బ్యాడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు త్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అదే బ్యాడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కంటిన్యూ అవ్వొచ్చు. అదే ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయితే బ్లూటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నెలకు 8 డాలర్లు కట్టాలి. 25 వేల క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు పోస్ట్ చేసుకోవచ్చు.

ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రెండింగ్ టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సపరేట్ ట్యాబ్ ఉంటుంది. కానీ, త్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి ఫీచర్ ఇంకా తీసుకురాలేదు. అలాగే త్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్టులను సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు.

ట్విటర్‌‌లో వచ్చినట్టు త్రెడ్స్ లో యాడ్స్ రావు. ఈ ఫీచర్ కొత్త యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇకపోతే అకౌంట్లను బ్లాక్ చేయడం, మ్యూట్ చేయడానికి త్రెడ్స్‌లో ఆప్షన్స్ ఉన్నాయి.

First Published:  9 July 2023 4:29 PM IST
Next Story