Telugu Global
Science and Technology

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్‌, మస్క్‌

అయితే.. ఇందుకు ఒక దిశ విఫలమవ్వగా.. రెండో దశ విజవంతమైంది.

స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్‌, మస్క్‌
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సంబంధాలు బలపడిన విషయం విదితమే. ఈ క్రమంలోనే స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఓ భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీరద్దరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, ఇందుకు ఒక దిశ విఫలమవ్వగా.. రెండో దశ విజవంతమైంది.

టెక్సాస్‌లో సుమారు 400 అడుగుల ఎత్తైన భారీ రాకెట్‌ను స్పేస్‌ ఎక్స్‌ మంగళవారం ప్రయోగించింది. చంద్రుడిపై వ్యోమగాములు, అంగారకుడి పైకి ఫెర్రీ క్రూను చేర్చడానికి ఈ రాకెట్‌ను డిజైన్‌ చేశారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రకారం బూస్టర్‌ భూమి మీదికి తిరిగి వస్తే లాంచ్‌ ప్యాడ్‌ వద్ద ఉండే మెకానికల్‌ ఆర్మ్స్‌ దాన్ని పట్టుకోవాల్సి ఉన్నది. కానీ సాంకేతిక సమస్య కారణంగా బూస్టర్‌ సముద్రంలో కుప్పకూలింది. ట్రంప్‌ సమక్షంలో మాత్రం అలా పట్టుకోవడంలో విఫలమైంది.మరో పరీక్ష కోసం ఉపయోగించిన ఖాళీ స్టార్‌షిప్‌ దాదాపు 90 నిమిషాల పాటు భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా హిందు మహాసముద్రంలో లాండ్‌ అయ్యింది. ఈ దృశ్యాలను స్పేస్‌ ఎక్స్‌ తమ సోషల్‌ మీడియాలోషేర్‌ చేసింది.

గత నెలలో స్సేస్‌ ఎక్స్‌ సంస్థ భారీ స్టార్‌ షిప్‌ బూస్టర్‌ను విజయవంతంగా రికవరీ చేసింది. ప్రయోగించిన లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు చేరుకున్న బూస్టర్‌ను మెకానికల్‌ ఆర్మ్స్‌ను పట్టుకున్నది. ఇది ఓ ఇంజినీరింగ్‌ అద్భుతంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

First Published:  20 Nov 2024 2:16 PM IST
Next Story