ట్రూకాలర్‌లో ప్రీమియం ఫీచర్స్!
Truecaller Premium Features: యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ట్రూకాలర్ యాప్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టొచ్చు అంటోంది.
యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ట్రూకాలర్ యాప్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టొచ్చు అంటోంది.
కాలర్ ఐడెటిఫికేషన్ యాప్ ట్రూకాలర్.. ఫ్యామిలీ ప్లాన్ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో ఐదుగురు యూజర్లు ఒకేసారి ట్రూకాలర్ ప్రీమియం సేవలను పొందొచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్ దాన్ని కుటుంబ సభ్యులతోపాటు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.132 ఉంది.
ట్రూకాలర్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లకు యాడ్-ఫ్రీ సేవలతోపాటు పలు రకాల అడ్వాన్స్‌డ్ సర్వీస్‌లను కూడా అందిస్తోంది. స్పామ్‌కాల్స్ రాకుండా అడ్డుకోవడం, ట్రూకాలర్ ప్రొఫైల్ ఎవరెవరు చూశారనేది తెలుసుకోవడం, ప్రీమియం బ్యాడ్జ్, అన్‌లిమిటెడ్ కాంటాక్ట్ రిక్వెస్ట్, ఇన్‌కాగ్నిటో మోడ్, కాలర్ అనౌన్స్‌మెంట్, ఘోస్ట్ కాల్స్ వంటి ఫీచర్లు అదనంగా పొందొచ్చు.
ప్రస్తుతం ఈ సేవలను అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సైబర్ మోసాల బారిన పడకుండా సేఫ్‌గా ఉండొచ్చని కంపెనీ చెప్తోంది.
రీసెంట్‌గా ట్రూకాలర్ తీసుకొచ్చిన గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌కు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా కార్యాలయం నుంచి ఫోన్ చేస్తే.. స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అలానే ఫోన్ నంబర్ పక్కన బ్లూ టిక్ ఉంటుంది. దీంతో ఫోన్ ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిందా? లేదా? అనేది సులువుగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం పేరుతో జరిగే మోసాలకు ఈ ఫీచర్ అడ్డుకట్ట వేస్తోంది.