ఫోన్ మీ లోకేషన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే..
గూగుల్‌తో సహా మొబైల్‌లో ఉండే పలు యాప్స్ మనకు తెలియకుండా మన లొకేషన్, మాటలను ట్రాక్ చేస్తుంటాయి.
మొబైల్‌తో ఎన్ని లాభాలున్నాయో అన్నే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించిన చాలా విషయాల్లో మొబైల్ మనల్ని మోసం చేస్తుంటుంది. గూగుల్‌తో సహా మొబైల్‌లో ఉండే పలు యాప్స్ మనకు తెలియకుండా మన లొకేషన్, మాటలను ట్రాక్ చేస్తుంటాయి. యూజర్లు సెట్టింగ్స్ మార్చుకునే వరకూ ఇలాంటి ట్రాకింగ్స్‌ను ఆపలేరు. మరి దీన్నెలా డిజేబుల్ చేయాలంటే..
మొబైల్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు యాక్సెస్ కోసం కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. ఈ పర్మిషన్స్‌తోనే ఇబ్బందులన్నీ. కొన్ని యాప్స్ అవసరం లేకున్నా అన్ని రకాల యాక్సెస్‌లు తీసుకుంటాయి. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ యాప్‌కు లొకేషన్ యాక్సెస్ అవసరం. కానీ, మైక్రోఫోన్, కాంటాక్ట్స్ పర్మిషన్ అవసరం లేదు.
అలాగే ఫొటో ఎడిటింగ్ యాప్‌కు స్టోరేజ్, కెమెరా యాక్సెస్ అవసరమవుతాయి. కానీ లొకేషన్‌తో పనిలేదు. కానీ, కొన్ని యాప్స్ అవసరం లేకపోయినా అన్నిరకాల పర్మిషన్స్ తీసుకుని మన వివరాలు ట్రాక్ చేసి అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలకు ఇస్తుంటాయి. కాబట్టి మన ప్రైవసీని సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఒకసారి యాప్స్‌కు ఇచ్చిన పర్మిషన్స్ చెక్ చేసుకోవడం అవసరం.
దీనికోసం ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి, ‘యాప్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
ఆ తర్వాత ‘పర్మిషన్స్’పై నొక్కితే లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా ఇలా.. పర్మిషన్స్ లిస్ట్ కనిపిస్తుంది.
అందులో ఒక్కో ఆప్షన్ సెలక్ట్ చేస్తే.. ఏయే యాప్స్‌కు ఏయే పర్మిషన్స్ ఉన్నాయో కనిపిస్తుంది.
ఇప్పుడు అవసరం లేని యాప్స్‌కు లొకేషన్, మైక్రోఫోన్ లాంటి పర్మిషన్స్ డిజేబుల్ చేయాలి.
ఇలా అన్ని యాప్స్‌ను ఒకసారి చెక్ చేసి పర్మిషన్స్‌ను రివ్యూ చేసుకోవడం వల్ల ఫోన్ మన లోకేషన్ , ఇతర వివిరాలు దొంగచాటుగా ట్రాక్ చేయకుండా జాగ్రత్తపడొచ్చు.