Telugu Global
Science and Technology

టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ కారు ఇదే

త్వరలోనే మార్కెట్‌ లోకి రానున్న కొత్త ఎస్‌యూవీ

టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ కారు ఇదే
X

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ నెక్సాన్‌ లైనప్‌ లో ఐసీఎన్‌జీ పేరుతో కొత్త వేరింట్‌ ఎస్‌యూవీని మార్కెట్‌ లోకి తీసుకురాబోతుంది. ఈ కారు ప్రత్యేకతలను సంస్థ వెల్లడించింది. ఐసీఎన్‌జీ కారు ధర (ఎక్స్‌ షోరూం ప్రైస్‌) రూ.8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. అత్యాధునిక ఫీచర్లను ఈ కారులో చేర్చినట్టు టాటా మోటార్స్‌ వెల్లడించింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ తో ఈ కారును రూపొందించారు. డ్యూయల్‌ సిలిండర్‌ సదుపాయంతో ఈ కారును లాంచ్‌ చేశారు. కారులో రెండు స్లిమ్‌ సిలిండర్లు ఏర్పాటు చేయడంతో కార్గో ఏరియా విశాలంగా ఉందని, ఆరు ఎయిర్‌ బ్యాగులతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు కల్పించామని సంస్థ వెల్లడించింది. పనోరమిక్‌ సన్‌ రూఫ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ డిస్‌ ప్లే, 360 డిగ్రీల కెమెరా, నావిగేషన్‌ డిస్‌ ప్లే అన్ని అధునాతన హంగులు ఉన్న టాప్‌ ఎండ్‌ కారు ఎక్స్‌ షోరూం ధర రూ.14.50 లక్షలుగా ఉందని, అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరిగా ఉంటాయని టాటా మోటార్స్‌ వెల్లడించింది.

First Published:  24 Sept 2024 3:09 PM IST
Next Story