ట్విట్టర్‌లో రానున్న కొత్త మార్పులు ఇవే
New changes coming in Twitter: ట్విట్టర్ సీఈఓగా ఎలన్ మస్క్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ట్విట్టర్‌లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను దక్కించుకున్న తర్వాత సంస్థలో చాలా మార్పులు చేయబోతున్నాడు. ఇప్పటికే బోర్డు సభ్యులను తొలగించి, ఏకైక బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. పరాగ్ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త సీఈఓను ఇప్పటివరకు నియమించలేదు. ట్విట్టర్ సీఈఓగా ఎలన్ మస్క్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ట్విట్టర్‌లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించారు. అవేంటంటే..
ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఊహాగానాలను నిజం చేస్తూ 'బ్లూ టిక్ 'కు డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వెరిఫైడ్ అకౌంట్స్‌గా గుర్తించే బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని చెప్పారు. అయితే డబ్బులు చెల్లించి బ్లూ టిక్ పొందినవారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయట. రిప్లై, మెన్షన్, సెర్చ్ వంటి ఫీచర్లలో బ్లూటిక్ యూజర్స్‌కు ప్రాధాన్యం ఉంటుందట. స్పామ్‌ను నివారించడానికి ఈ ఫీచర్లు అసవరమని మస్క్ తెలిపారు. అలాగే ట్విట్టర్‌లో ఇకపై ఎక్కువ నిడివి గల వీడియో, ఆడియోను పోస్ట్ చేసే వెసులుబాటుతో పాటు, ప్రకటనలు సగానికి తగ్గుతాయన్నారు.
ట్విట్టర్‌లో ఇకపై కొన్ని పాపులర్ పబ్లిషర్ల ఆర్టికల్స్‌కు 'పేవాల్ బైపాస్' కూడా ఉంటుందంటున్నారు. అంటే పెయిడ్ కంటెంట్‌కు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ట్విట్టర్‌లో చదివే వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలో పేరు కింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని తెలిపారు. ట్విట్టర్ లో చేసిన ఈ మార్పుల వల్ల మరింత ఆదాయం సమకూరుతుందని, దాన్ని కంటెంట్ క్రియేటర్లకు చెల్లించేందుకు అవకాశం కలుగుతుందని మస్క్ అన్నారు.