ఛానెల్స్, మ్యూజిక్ స్టోరీస్.. టెలిగ్రామ్ లో కొత్త ఫీచర్లు!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.. టెలిగ్రామ్ 10వ యానివర్సరీ సందర్భంగా కొన్ని లేటెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొన్ని విభిన్నమైన అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.. టెలిగ్రామ్ 10వ యానివర్సరీ సందర్భంగా కొన్ని లేటెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొన్ని విభిన్నమైన అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు టెలిగ్రామ్. ఇందులో మెసేజింగ్‌తో పాటు మార్కెటింగ్, బిజినెస్‌కు సంబంధించిన ఫీచర్లు కూడా ఎక్కువే. అయితే ఇందులో ఛానెల్ స్టోరీస్, రియాక్షన్ స్టిక్కర్స్, మ్యూజిక్ స్టోరీస్, వ్యూ వన్స్ మీడియా, న్యూ లాగిన్ అలర్ట్స్.. వంటి పలురకాల కొత్త అప్ డేట్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే..
టెలిగ్రామ్‌లో ‘ఛానెల్స్’ ఫీచర్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్‌లో స్టోరీస్ కూడా పోస్ట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది. ఛానెల్స్ స్టోరీస్‌ను పోస్ట్ చేయాలంటే ఆ ఛానెల్‌కు కనీసం ఒక బూస్ట్ ఉండాలి. బూస్ట్ అనేది టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఉండే స్పెషల్ టోకెన్ వంటిది. అలాగే యూజర్లు, ఛానెల్ క్రియేటర్లు స్టికర్స్ రూపంలో అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలుగా స్టోరీస్‌కు స్టిక్కర్లను యాడ్ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది.
వాట్సాప్‌లో ఉన్న ‘వ్యూ వన్స్ మీడియా’ ఫీచర్ ఇప్పుడు టెలిగ్రామ్‌లో కూడా రానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు.. ఒకసారి చూశాక తానంతట అదే అదృశ్యమయ్యేలా మీడియా ఫైల్స్‌ను పంపొచ్చు. అవతలి వాళ్ల ఫోన్‌లో సేవ్ అవ్వకుండా ఫోటోల వంటివి పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇకపోతే స్టోరీస్‌లో ఆడియో ట్రాక్‌లు, వాయిస్ ఓవర్స్ వంటి సౌండ్ ఎఫెక్ట్‌లు స్టోరీస్‌లో పెట్టుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యాడ్ చేయనుంది టెలిగ్రామ్. దీంతోపాటు హ్యాకింగ్‌ను నిరోధించేందుకు కొత్త లాగిన్ అలర్ట్స్‌ను తీసుకురాబోతోంది. యూజర్లు వేరొక డివైజ్ లేదా లొకేషన్ నుంచి టెలిగ్రామ్ అకౌంట్‌కు లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ డివైజ్‌లన్నిటికీ నోటిఫికేషన్ వస్తుంది. యూజర్లు తమకు తెలియని డివైజ్‌లో లాగిన్ అయినట్టు గుర్తిస్తే.. వెంటనే అలర్ట్‌పై ఉండే ‘నో ఇట్స్ నాట్ మీ’ పై క్లిక్ చేస్తే అకౌంట్ సెక్యూర్‌గా ఉంటుంది.