Telugu Global
Science and Technology

Tecno POVA 6 Pro | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పోవా6 ప్రో.. 29న భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌ర‌ణ‌..?!

Tecno POVA 6 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో పోవా6 ప్రో (Tecno POVA 6 Pro) ఫోన్‌ను ఈ నెల 29న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Tecno POVA 6 Pro | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పోవా6 ప్రో.. 29న భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌ర‌ణ‌..?!
X

Tecno POVA 6 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో పోవా6 ప్రో (Tecno POVA 6 Pro) ఫోన్‌ను ఈ నెల 29న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ర‌ష్ మీడియా ప్లేగ్రౌండ్ సీజ‌న్‌3 స‌హ‌కారంతో ఆవిష్క‌రిస్తున్న ఈ మిడ్ రేంజ్ ఫోన్ 70 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. గ‌త నెల‌లో బార్సిలోనాలో జ‌రిగిన మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్‌లో దీన్ని టెక్నో ప్ర‌ద‌ర్శించింది.

బెట‌ర్‌, ఫాస్ట‌ర్‌, స్ట్రాంగ‌ర్‌ ఎక్స్‌పీరియ‌న్స్ అందింజేందుకు జెన్‌-జ‌డ్ ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో వ‌స్తోంది టెక్నో పోవా6 ప్రో ఫోన్‌. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన టెక్నో పోవా6 ప్రో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 2160 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌, 2436 ×1080 పిక్సెల్స్ రిజొల్యూష‌న్‌తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎన్ఎం ప్రాసెస‌ర్ విత్ మాలీ-జీ57 ఎంసీ2 జీపీయూతో ప‌ని చేస్తుంది.

టెక్నో పోవా6 ప్రో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ల‌లో వ‌స్తుంది. మైక్రోఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు. వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 12 జీబీ ర్యామ్ విస్త‌రించుకోవ‌చ్చు. టెక్నో పోవా6 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ క‌స్ట‌మ్ స్కిన్ ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

టెక్నో పోవా6 ప్రో ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 2-మెగా పిక్సెల్ అండ్ ఏఐ లెన్స్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా క‌లిగి ఉంటుంది. 5జీ, డ్యుయ‌ల్ 4జీ వోల్ట్‌, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌, ఎన్ఎఫ్‌సీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. 70 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది.

First Published:  24 March 2024 11:16 AM GMT
Next Story