Tecno Pova | భారత్ మార్కెట్లోకి టెక్నో పొవా సిరీస్ ఫోన్లు.. ఆగస్టు 22 నుంచి సేల్స్ ప్రారంభం.. ఇవీ డిటైల్స్!
Tecno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno).. తన టెక్నోపొవా5 (Tecno Pova 5), టెక్నో పొవా5 ప్రో (Tecno Pova 5 Pro) సేల్స్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
Tecno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno).. తన టెక్నోపొవా5 (Tecno Pova 5), టెక్నో పొవా5 ప్రో (Tecno Pova 5 Pro) సేల్స్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఈ ఫోన్లను ఆవిష్కరించారు. టెక్నో పొవా5 (Tecno Pova 5) ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 చిప్‌సెట్ (MediaTek Helio G99), టెక్నో పొవా5 ప్రో (Tecno Pova 5 Pro) ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ (octa-core MediaTek Dimensity 6080 SoC)తో వస్తున్నది.
టెక్నో పొవా 5 (Tecno Pova 5) ఫోన్ రూ.11,999, టెక్నో పొవా 5 ప్రో (Tecno Pova 5 Pro) ఫోన్ రూ.14,999లకు లభిస్తాయి. ఈ నెల 22 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వేదికగా సేల్స్ ప్రారంభం అవుతాయి. పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.1000 డిస్కౌంట్‌తోపాటు టెక్నో కొవా 5 (Tecno Pova 5) ఫోన్ కొనుగోలుపై ఆరు నెలల పాటు నో-ఈఎంఐ కాస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
టెక్నో పొవా 5ప్రో (Tecno Pova 5 Pro) ఫోన్ డార్క్ ఇల్లుషన్స్, సిల్వర్ ఫాంటసీ కలర్ ఆప్షన్లు, టెక్నో పొవా5 (Tecno Pova 5) ఫోన్ అంబర్ గోల్డ్, హరికేన్ బ్లూ, మెకా బ్లాక్ కలర్స్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. టెక్నో పొవా5 అండ్ టెక్నో పొవా5 ప్రో ఫోన్లు రెండు 6.78-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ హెచ్ఐఓఎస్ స్కిన్ వర్షన్‌పై పని చేస్తాయి. రెండు ఫోన్లలోనూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరా కలిగి ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం టెక్నో పొవా5 ఫోన్‌లో 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్, టెక్నో పొవా5 ప్రోలో 16-మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సర్ కెమెరా ఉంటాయి.
టెక్నో పొవా5, టెక్నో పొవా5 ప్రో ఫోన్లు రెండూ 4జీ వోల్ట్, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. టెక్నో పొవా5 ప్రో ఫోన్ 5జీ కనెక్టివిటీ, ఆర్క్ ఇంటర్‌ఫేస్ విత్ ఎల్ఈడీ ఆన్ ది బ్యాక్ ప్యానెల్‌కి సపోర్ట్‌గా ఉంటుంది. రెండు ఫోన్లకు బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉంటాయి.
టెక్నో పొవా5 ఫోన్ 45 వాట్ల చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, టెక్నో పొవా5 ప్రో ఫోన్ 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.
Tecno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. భారత్ మార్కెట్లో తన పొవా5, పొవా5 ప్రో ఫోన్లు ఆవిష్కరించింది. టెక్నో పొవా5 ఫోన్ రూ.11,999, టెక్నో పొవా5 ప్రో ఫోన్ రూ.14,999లకు లభిస్తాయి. ఈ నెల 22 నుంచి అమెజాన్ వేదికగా టెక్నో పొవా సిరీస్ పోన్ల సేల్స్ ప్రారంభం అవుతాయి.