Telugu Global
Science and Technology

ఫోన్‌లో డేటా స్పీడ్ పెరిగేందుకు టిప్స్!

మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. అయితే నెట్‌వర్క్ ప్రొవైడర్ అందించే డేటాను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ పనికొస్తాయి.

ఫోన్‌లో డేటా స్పీడ్ పెరిగేందుకు టిప్స్!
X

ఫోన్‌లో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోతే ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. పేమెంట్ చేస్తున్నప్పుడు లేదా ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఇంటర్నెట్ స్లో అయితే చాలా సమస్యగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. అయితే నెట్‌వర్క్ ప్రొవైడర్ అందించే డేటాను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ పనికొస్తాయి. అవేంటంటే..

ఎక్కువ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ స్పీడ్ స్లో అయినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. అలాగే ఒకసారి డేటా ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇలా చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ నార్మల్‌కు వచ్చే అవకాశం ఉంది.

ఒక్కోసారి నెట్‌వర్క్‌ సిగ్నల్‌లో వచ్చే సమస్యల కారణంగా ఇంటర్నెట్ ఆగిపోతుంటుంది. అలాంటప్పుడు ఫోన్‌లో ‘ఏరోప్లేన్‌ మోడ్‌’ ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తే సిగ్నల్ రీకనెక్ట్ అవుతుంది.

ఫోన్‌లో ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్స్ సెట్టింగ్‌ ఆన్‌లో ఉంటే దానివల్ల తరచూ ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆటో అప్‌డేట్‌ సెట్టింగ్‌ను ఆఫ్‌లో ఉంచుకుంటే మంచిది.

ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడంతో పాటు ఫోన్ కూడా స్లో అవుతుందంటే సాఫ్ట్‌వేర్‌‌లో ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఫోన్‌ను స్విచాఫ్ చేసి రెండు నిముషాల తర్వాత ఆన్ చేస్తే.. ఓఎస్ రీస్టార్ట్ అవుతుంది. ఇంటర్నెట్ మునుపటిలా పనిచేస్తుంది.

ఇకపోతే ఇంటర్నెట్ సిగ్నల్ ఆగిపోకుండా ఉండాలంటే కనెక్టివిటీ సెట్టింగ్స్‌లో ‘నెట్‌వర్క్ టైప్’ను కేవలం 4జీ లేదా 5జీ కాకుండా ఆటోమెటిక్‌లో ఉంచుకోవాలి. అప్పుడు సిగ్నల్ స్ట్రెంత్‌ను బట్టి డేటా మోడ్ ఆటోమెటిక్‌గా మారుతుంటుంది.

ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మిగతా యాక్టివిటీస్ ఆప్టిమైజ్ అయ్యి ఇంటర్నెట్ స్పీడ్ కాస్త పెరుగుతుంది. అలాగే ఫోన్‌ బ్రౌజర్‌‌లో క్యాచీ, కుకీస్ వంటి​ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే డేటా స్పీడ్ బాగుంటుంది.

దీంతోపాటు ఫోన్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్ స్టా్ల్ చేసుకోవడం వల్ల కూడా నెట్‌వర్కింగ్‌లో వచ్చే సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది.

First Published:  21 Dec 2023 12:48 PM IST
Next Story