Telugu Global
Science and Technology

టెక్ రివ్యూ 2023! ఈ ఏడాది టెక్ లవర్స్‌ను ఆకట్టుకున్న విషయాలివే..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ వరకూ ఈ ఏడాది టెక్ లవర్స్ కు గుర్తుండిపోయే మెమరీస్ చాలానే ఉన్నాయి.

టెక్ రివ్యూ 2023! ఈ ఏడాది టెక్ లవర్స్‌ను ఆకట్టుకున్న విషయాలివే..
X

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ వరకూ ఈ ఏడాది టెక్ లవర్స్ కు గుర్తుండిపోయే మెమరీస్ చాలానే ఉన్నాయి. ఈ ఏడాది రకరకాల కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్‌లతో పాటు టెక్ రంగంలో పలు కొత్త మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన టెక్నాలజీ ట్రెండ్స్‌పై బ్రీఫ్‌గా ఓ లుక్కేస్తే..

ముఖ్యంగా 2023 సంవత్సరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు పునాదిగా చెప్పుకోవచ్చు. ఛాట్ జీపీటీ.. గతేడాది లాంఛ్ అయినప్పటికీ దానికి పోటీగా ఈ ఏడాది బోలెడు ఏఐ టూల్స్ ఎంట్రీ ఇచ్చాయి.

బార్డ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన గూగుల్.. ‘బార్డ్’ పేరుతో సాలిడ్ ఏఐ టూల్‌ను బరిలోకి దింపింది. చాట్ జీపీటీని తలదన్నేలా డేటా బేస్డ్ ఏఐ టూల్‌గా బార్డ్ ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది దీన్నుంచి మరిన్ని అప్‌డేట్స్‌ ఆశించొచ్చు.

చాట్ జీపీటీ

గతేడాది రిలీజైన చాట్ జీపీటీకి ఈ ఏడాది మరిన్ని కొత్త అప్‌డేట్స్ వచ్చి చేరాయి. కానీ, ఈ టూల్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు సెర్చ్ ఇంజిన్‌లోనే ఏఐ బేస్డ్ రిజల్ట్స్‌ను పొందుపరచడంతో ఒపెన్ ఏఐకి యూజర్ల సంఖ్య తగ్గింది.

డీప్ ఫేక్

ఈ ఏడాది వార్తల్లో నిలిచిన టెక్నాలజీలో డీప్ ఫేక్ ముందుంటుంది. ఏఐకు చెందిన డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి కొందరు వ్యక్తులు ఫేక్ వీడియోలు సృష్టించడం ఈ ఏడాది కాస్త కలకలం రేపింది.

ఫోల్డబుల్ ఫోన్స్

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది ఫోల్డబుల్ ఫోల్స్ హల్‌చల్ చేశాయి. శాసంగ్, గూగూల్ పిక్సెల్‌తో పాటు వన్‌ప్లస్, మోటొరోలా వంటి సంస్థలు కూడా ఫోల్డబుల్ ఫోన్స్‌ను అనౌన్స్ చేశాయి.

జెమినీ

ఈ ఏడాది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్స్‌లో ‘జెమినీ’ కూడా ఒకటి. ఇది ఇంకా అందుబాటులోకి రాకపోయినప్పటికీ పూర్తి స్థాయి ఏఐ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్‌గా జెమినీ పాపులర్ అయింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.

ఇంటర్నెట్ షట్‌డౌన్స్

ఈ ఏడాది వార్తల్లో నిలిచిన మరో అంశం ఇంటర్నెట్ షట్‌డౌన్స్. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఇంటర్నెట్ షట్‌డౌన్స్ జరిగాయి. రిపోర్ట్స్‌ ప్రకారం 2023లో 6,300 గంటలపాటు ఇంటర్నెట్ ఆగిపోయిందట.

లే ఆఫ్స్

ఐటీ రంగంలో ఈ ఎడాది లేఆఫ్స్ ట్రెండ్ బాగా కనిపించింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి సాధారణ సంస్థల వరకూ చాలా కంపెనీలు వేల కొద్దీ ఎంప్లాయిస్‌కు లేఆఫ్ ప్రకటించాయి.

భయపెట్టిన ప్రశ్న

ఈ ఏడాది టెక్ రంగంలో బాగా వినిపించిన ప్రశ్న.. ‘మనుషుల ఉద్యోగాలను ఏఐ రిప్లేస్ చేస్తుందా?’ అని. ఈ ప్రశ్నకు అసలైన సమాధానం దొరకనప్పటికీ ఈ ఏడాది చాలామందికి కలవరపెట్టిన ప్రశ్న ఇది.

టైప్–సి

ఈ ఏడాది వచ్చిన మార్పుల్లో యూనివర్సల్ టైప్–సి ఛార్జర్ ఒకటి. యాపిల్ సహా అన్ని మొబైల్ సంస్థలు ఒకటే చార్జర్ పోర్ట్‌ను రూపొందించాలన్న రూల్ ఈ ఏడాది అమల్లోకి వచ్చింది.

ఇకపోతే ఈ ఎడాది ట్విటర్ పేరు ‘ఎక్స్‌’గా మారింది. దాంతోపాటు మార్క్ జుకర్ బర్క్ ఎలన్‌మస్క్ మధ్య ఆన్‌లైన్ వేదికగా జరిగిన పలు ట్వీట్ వార్‌‌లు కూడా చాలామందికి గుర్తుండే ఉంటాయి.

First Published:  24 Dec 2023 12:45 PM GMT
Next Story