ఆండ్రాయిడ్ 13లో శాటిలైట్ ఇంటర్నెట్?
త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు.
రీసెంట్‌గా గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. అయితే యూజర్లు కామన్‌గా ఫేస్ చేసే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్‌ను ఈ వెర్షన్ ద్వారా సాల్వ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు గూగుల్ చెప్తోంది. అందులో ముఖ్యమైంది కాల్ నాయిస్.
కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మధ్యలో నాయిస్ డిస్ట్రబెన్స్ వస్తుంటుంది. ఈ నాయిస్ వల్ల అవతలి వ్యక్తి ఏం చెప్తున్నాడనేది సరిగా వినపడదు. గూగుల్ త్వరలో విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ 13లో ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. ఆండ్రాయిడ్ 13లో 'క్లియర్ కాలింగ్' పేరుతో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. యూజర్ ఫోన్ కాల్స్ మాట్లాడేప్పుడు ఈ ఫీచర్.. నాయిస్ డిస్ట్రబెన్స్‌ను తగ్గిస్తుంది. అయితే ఈ ఫీచర్ మొబైల్ నెట్‌వర్క్‌లకు మాత్రమే పనిచేస్తుంది. వైఫై ద్వారా చేసే ఫోన్స్ కాల్స్‌లో పనిచేయదు.
ఇక దీంతో పాటు ఐఫోన్ 14లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులోకి రాబోతుందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఆండ్రాయిడ్‌లోనూ ఇలాంటి సాంకేతికత ఉంటుంది అని గూగుల్ ఆండ్రాయిడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరోషీ లొషెమెర్ ట్వీట్ చేశారు. దీంతో త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు. అయితే మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొస్తామని స్పేస్ ఎక్స్ గతంలో నే ప్రకటించింది. 2023లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కూడా తెలిపింది. ఇప్పటికే యూఎస్, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చూడాలి.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ ఓఎస్ దశలవారీగా శాంసంగ్ , అసుస్, నోకియా, ఐకూ, మోటోరోలా, వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మీ, టెక్నో, వివో, షావోమితోపాటు ఇతర ఫోన్లలో అందుబాటులోకి రానుంది.