Telugu Global
Science and Technology

శాంసంగ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్! వివరాలివే..

పాపులర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. త్వరలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5 వంటి మొబైల్స్‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకురాబోతోంది.

శాంసంగ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్! వివరాలివే..
X

పాపులర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. త్వరలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5 వంటి మొబైల్స్‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకురాబోతోంది.

కొన్ని లీక్స్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర ఇండియాలో రూ. 1,49,999గా ఉంటుందని, లాంచింగ్ ఆఫర్ కింద రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గా ఉంది. లాంచింగ్ ఆఫర్ లో దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలుస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ .. 5, 7.6 ఇంచెస్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా వంటీ ఫీచర్లతో రాబోతోంది. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 3.4 ఇంచెస్ కవర్ డిస్‌ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్‌ ఉండబోతోంది. ఈ రెండు ఫోన్లు, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ చిప్‌సెట్‌తో పని చేస్తాయి. ‘ఐపీఎక్స్‌8’ వాటర్ ప్రూఫ్ సర్టిఫికేట్‌తో వస్తాయి. 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా కూడా ఈ ఫోన్లు తట్టుకోగలవు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఇవి ఆగస్టు నెలలో ఇండియాకు వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక మొబైల్స్‌తో పాటు గెలాక్సీ వాచెస్‌, గెలాక్సీ ట్యాబ్స్‌ కూడా ఇక్కడి మార్కెట్లోకి రాబోతున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లు కూడా ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన డిస్‌ప్లేలు , ప్రాసెసర్‌లతో ఇవి ఉండబోతున్నాయి. ట్యాబ్స్ విషయానికొస్తే.. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, ఎస్ 9 ప్లస్ , ఎస్ 9 అల్ట్రాలు కూడా లాంచ్ అవ్వబోతున్నాయి. శాంసంగ్‌ తయారుచేసిన తొలి స్మార్ట్ రింగ్ కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. గెలాక్సీ రింగ్‌తో పాటు సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. ‘బడ్స్ 3’ కూడా లాంచ్ అవ్వొచ్చు.

First Published:  31 July 2023 4:20 PM IST
Next Story