Samsung Galaxy S24: శాంసంగ్ ఇండిపెండెంట్ ఆఫర్.. ఆ ఫోన్‌పై రూ.12 వేల తగ్గింపు....!
Samsung Galaxy S24 Discount: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Samsung Galaxy S24) ఫోన్ మీద రూ.12 వేల ధర తగ్గించింది.

Samsung Galaxy S24: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) ఫోన్‌పై స్వాతంత్య్రదినోత్సవ ఆఫర్ కింద భారీగా ధర తగ్గించింది. ధర తగ్గించడంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఆఫర్ చేసింది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వుంటుంది. అయితే ఈ ఆఫర్ వచ్చే వారం వరకూ అమల్లో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Samsung Galaxy S24) ఫోన్ మీద రూ.12 వేల ధర తగ్గించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.62,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.74,999లుగా ప్రకటించింది శాంసంగ్. అలాగే నెలకు రూ.5,666 చొప్పున 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందొచ్చు. 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,999 నుంచి 67,999, 512జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.89,999 నుంచి రూ.77,999లకు దిగి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ ధర రూ.56 వేల నుంచి ప్రారంభమైతే, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62 వేల నుంచి సేల్స్ మొదలవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) ఫోన్ 129 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్ అండ్ విజన్ బూస్టర్ మద్దతు కలిగి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన శాంసంగ్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. భారత్ మార్కెట్లో ఎక్స్‌యోనాస్ 2400 ప్రాసెసర్‌పై వస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 50-మెగా పిక్సెల్ వైడ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటాయి. 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 25వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్ షేర్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.