Samsung Galaxy M34 5G | సింగిల్ చార్జింగ్‌తో రెండ్రోజుల బ్యాకప్.. అత్యాధునిక ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ
Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో మిడ్ రేంజ్ ఫోన్ తీసుకొస్తున్నది.
Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో మిడ్ రేంజ్ ఫోన్ తీసుకొస్తున్నది. భారత్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఆవిష్కరించింది. శాంసంగ్ సిగ్నేచర్ డిజైన్ (Samsung Signature Design) తో వస్తున్న ఈ ఫోన్ 6 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ రామ్ వేరియంట్ ధర రూ.16,999 (ఎక్స్ షోరూమ్), 8జీబీ రామ్ వేరియంట్ ధర రూ.18,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. బ్యాంకు ఆఫర్‌లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ధరలు ప్రారంభ ఆఫర్ అని పేర్కొన్న శాంసంగ్.. అందుకు ఎంత గడువు అన్న సంగతి వెల్లడించలేదు.
అత్యంత శక్తిమంతమైన 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. ఈ ఫోన్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఒన్ యూఐ 5 వర్షన్‌తో పని చేస్తుంది. 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1080x2,408 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ (Samsung Galaxy M34 5G) ఎక్సినోస్ 1280 ఎస్వోసీ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇటీవలి కాలంలో శాంసంగ్ పలు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌లు ఆవిష్కరించింది. గెలాక్సీ 34 5జీ ఫోన్‌పై నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌డే సందర్భంగా ఈ నెల 15 నుంచి అమెజాన్‌తోపాటు కంపెనీ వెబ్‌సైట్‌లో కొనుక్కునేందుకు అందుబాటులో ఉంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్.. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇత్ 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2-మెగా పిక్సెల్ డెప్త్ లేదా మాక్రో సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. వీటితోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఫన్ మోడ్, నైటోగ్రఫీ వంటి కెమెరా ఫీచర్లు కూడా జత చేశారు. 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. డోల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన స్పీకర్లు ఉంటాయి.
అత్యాధునిక ఫీచర్లతో శాంసంగ్ తన గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అమెజాన్ ప్రైమ్‌డే సందర్భంగా ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభిస్తారు.