Samsung Galaxy F15 5G | న్యూ వేరియంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15జీ 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను గత మార్చిలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను గత మార్చిలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ (octa-core MediaTek Dimensity) ప్రాసెసర్, వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వీడీఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోకూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ (Android 14-based) వన్ యూఐ 5.0 ఔటాఫ్ బాక్స్ (One UI 5.0 out-of-the-box) వర్షన్‌పై పని చేస్తుంది. ఇంతకుముందు రెండు ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ వచ్చింది. తాజాగా మూడో ర్యామ్ ఆప్షన్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ కొత్తగా ఆవిష్కరించిన 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తుంది. ఇంతకుముందు ఆవిష్కరించిన 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూ.1000 తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. ఈ ఫోన్ యాష్ బ్లాక్, గ్రూవీ వయోలెట్, జాజీ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ (Samsung Galaxy F15 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5- అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5.0 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. నాలుగేండ్లు ఓఎస్ అప్‌గ్రేడ్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల పాటు బ్యాటరీ లైఫ్, 25 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం ఉంటుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.