Redmi Note 12 Pro 5G | 12జీబీ రామ్‌తో మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 12ప్రో 5జీ.. ధరెంతంటే?!
Redmi Note 12 Pro 5G | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. భారత్ మార్కెట్లో తన రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ (Redmi Note 12 Pro 5G) కొత్త స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరించింది.
Redmi Note 12 Pro 5G | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. భారత్ మార్కెట్లో తన రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ (Redmi Note 12 Pro 5G) కొత్త స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరించింది. గత జనవరిలో 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లను తీసుకొచ్చింది.
తాజాగా రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్12ప్రో 5జీ ఫోన్‌లో 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
రెడ్‌మీ నోట్12ప్రో 5జీ ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ భారత్ మార్కెట్లో రూ.28,999లకు లభిస్తుంది. ఎంఐ డాట్ కాం, ఫ్లిప్‌కార్ట్‌ల్లో కొనుక్కోవచ్చు. ప్రస్తుతం 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 8 జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.26,999లకు లభిస్తాయి. రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ ప్రొస్టెడ్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, ఓనిక్స్ బ్లాక్ షేడ్ కలర్స్‌లో లభిస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రెడ్‌మీ నోట్12 5జీ, రెడ్‌మీ నోట్12 ప్రో+ 5జీలతోపాటు రెడ్‌మీ నోట్12ప్రో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్12 బేస్డ్ ఎంఐయూ13 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1080x2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 394 ఎన్‌పీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తున్నది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్‌సెట్, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది.
రెడ్‌మీ ఓట్12 ప్రో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో వస్తుంది. 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67వాట్ల పాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.
Redmi Note 12 Pro 5G | షియోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్12ప్రో 5జీ ఫోన్‌లో కొత్తగా 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఇంతకుముందు 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.