Realme Narzo 60x | మార్కెట్లోకి రియల్‌మీ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్.. రియల్‌మీ నార్జో60ఎక్స్.. ఇవీ డిటైల్స్
Realme Narzo 60x | బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ ఆవిష్కరించింది.
Realme Narzo 60x | బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ ఆవిష్కరించింది. రియల్‌మీ నార్జో 60 (Realme Narzo 60), రియల్‌మీ నార్జో 60 ప్రో (Realme Narzo 60 Pro) ఫోన్లకు కొనసాగింపుగా రియల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ బుధవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. గత నెలలో మార్కెట్లోకి తెచ్చిన రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి రియల్‌మీ నార్జో 60ఎక్స్‌గా తెచ్చిందని తెలుస్తున్నది.
రియల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. నెబులా పర్పుల్, స్టెల్లర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ నెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మీ వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వేదికగా సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సేల్స్ లైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రియల్‌మీ (Realme) తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్ అందిస్తున్నది.
రియల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్.. 120 రీఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400 x 1080 పిక్సెల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ -13 బేస్డ్ రియల్‌మీ యూఐ 4.0 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో వస్తుంది. 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్.. వర్చువల్‌గా 12 జీబీ ర్యామ్ వరకు పొడిగించుకునే వీలుంది.
రియల్‌మీ నార్జో60 ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్స్ సెకండరీ సెన్సర్ విత్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 33వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో రియల్‌మీ నార్జో60ఎక్స్ ఫోన్ సిద్ధం చేశారు. 29 నిమిషాల్లో 30 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 5జీ, 4జీ, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ 2.0 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
రియల్‌మీ బడ్స్ టీ300 ఆవిష్కరణ
రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్‌తోపాటు రియల్‌మీ బడ్స్ టీ300 ఆవిష్కరించింది. 2.4 ఎన్ఎం డైనమిక్ బాస్ డ్రైవర్ విత్ 30డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఉంటుంది. 360-డిగ్రీ స్పాషియల్ ఆడియో ఫీచర్ ఉంటుంది. దీనివల్ల తమ ఫేవరేట్ మ్యూజిక్ వినియోచ్చు. బెటర్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ 4-మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది. 480 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో 40 గంటల వరకు ప్లేయింగ్ టైం వస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావడానికి 1.5 గంటలు పడుతుంది. రిలయన్స్ బడ్స్ టీ300 రూ.2299లకు అందుబాటులో ఉంటుంది.