Telugu Global
Science and Technology

Realme C61 | రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియ‌ల్‌మీ సీ61 ఆవిష్క‌ర‌ణ రేపే..!

Realme C61 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్ మీ (Realme) త‌న మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్‌లీ ఫోన్ రియ‌ల్‌మీ సీ 61 ( Realme C61) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌డానికి ముహూర్తం ఖ‌రారు చేసింది.

Realme C61 | రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియ‌ల్‌మీ సీ61 ఆవిష్క‌ర‌ణ రేపే..!
X

Realme C61 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్ మీ (Realme) త‌న మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్‌లీ ఫోన్ రియ‌ల్‌మీ సీ 61 ( Realme C61) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌డానికి ముహూర్తం ఖ‌రారు చేసింది. స్టైలింగ్ డిజైన్‌, స్మూత్ మ‌ల్టీ టాస్కింగ్‌, ప్రామిసింగ్ రోబ‌స్ట్ ఎఫిషియెంట్‌ పెర్ఫార్మెన్స్‌, సుపీరియ‌ర్ ఇమేజింగ్ కేప‌బిలిటీస్‌తో వ‌స్తోందీ స్మార్ట్ ఫోన్‌. యూనిసోక్ టీ 612 (UNISOC T612 processor) ప్రాసెస‌ర్‌, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ (5000mAh battery), 32-మెగా పిక్సెల్ కెమెరా (32MP camera), ఆర్మొర్ షెల్ ప్రొటెక్ష‌న్ (ArmorShell Protection)తో వ‌స్తోంది. రియ‌ల్‌మీ సీ61 ఫోన్ మూడు వేరియంట్ల‌లో వ‌స్తోంది. దీని ధ‌ర రూ.7,699తో ప్రారంభం అవుతుంది. ప్ర‌తి రోజూ ఫోన్ వాడ‌నా ప‌లు డిమాండ్ టాస్క్‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వీలుగా ఉంటుంది.

ఫోటోగ్ర‌ఫీ ప్రేమికుల కోసం డిటైల్డ్‌, వైబ్రంట్ ఫోటోల కోసం 32 మెగా పిక్సెల్ ఆల్ట్రా క్లియ‌ర్ ప్రైమ‌రీ కెమెరా ఉంటుంది. హై క్వాలిటీ ఇమేజీల కోసం అడ్వాన్స్డ్ ఆల్గోరిథ‌మ్స్‌, నైట్ మోడ్ ఫీచ‌ర్లు ఉంటాయి. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్లలో ల‌భిస్తుందీ రియ‌ల్‌మీ సీ61 ఫోన్. స‌ఫారీ గ్రీన్‌, మార్బుల్ బ్లాక్ రంగుల్లో సొంతం చేసుకోవ‌చ్చు. మూడు స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. రియ‌ల్‌మీ సీ61 ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,6999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,099ల‌కు ల‌భిస్తుంది.

రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ సీ61 ఫోన్‌లో తొలిసారి ఆర్మోర్ షెల్ ప్రొటెక్ష‌న్ ప్ర‌వేశ‌పెట్టింది. ఎనిమిది స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంప్రూమ్‌మెంట్స్‌తో డ్యూర‌బిలిటీని పెంపొందిస్తుందీ ఆర్మోర్ షెల్ ప్రొటెక్ష‌న్‌. ఇది డ్రాప్స్‌, బెండ్స్‌, స్క్రాచెస్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. టాయ్ వీ రెయిన్‌లాండ్ రిల‌య‌బిలిటీ స‌ర్టిఫికెట్‌, డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ క‌లిగి ఉంటుంది. రియ‌ల్‌మీ సీ61 ఫోన్ జూన్ 28 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రియ‌ల్‌మీ డాట్‌కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, దేశంలోని రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తుంది.

వేరియంట్ల వారీగా రియ‌ల్‌మీ సీ61 ఫోన్ ధ‌ర‌లు

–4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ: రూ. 7,699

–4 జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ: రూ. 7,999

–6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ: రూ. 8,099

ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కార్డుల‌పై కొనుగోలు చేసే వారికి రియల్‌మీ డిస్కౌంట్‌లు అందిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రికి టెక్నాల‌జీ ప‌రంగా రియ‌ల్‌మీ సాధికార‌త క‌ల్పిస్తుంద‌ని రియ‌ల్‌మీ అధికార ప్ర‌తినిధి తెలిపారు. త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్నా ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ల‌కు న్యూ బెంచ్ మార్క్ కానున్న‌ద‌న్నారు.

First Published:  27 Jun 2024 3:30 AM GMT
Next Story