Telugu Global
Science and Technology

Realme 12X 5G | రియల్‌మీ బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియ‌ల్‌మీ 12ఎక్స్‌5జీ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఎప్పుడంటే..?!

Realme 12X 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది.

Realme 12X 5G | రియల్‌మీ బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియ‌ల్‌మీ 12ఎక్స్‌5జీ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఎప్పుడంటే..?!
X

Realme 12X 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. వ‌చ్చేనెల రెండో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రియ‌ల్‌మీ12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్ భార‌త్ మార్కెట్‌లోకి రానున్న‌ది. రియ‌ల్‌మీ12ఎక్స్ 5జీతోపాటు రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ సిరీస్ (Realme 12 Series) ఫోన్లు కూడా రానున్నాయి. 45వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ (45W SuperVOOC fast charging), 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ (120Hz refresh rate) మ‌ద్ద‌తుతోపాటు ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వ‌స్తుంది. రియ‌ల్‌మీ 12ఎక్స్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ ఎస్వోసీ (MediaTek Dimensity 6100+ SoC) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. ఈ నెల 21న తొలుత చైనా మార్కెట్‌లో రియ‌ల్‌మీ12 ఎక్స్ (Realme 12X) ఆవిష్క‌రించింది.

రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ ఫోన్ (Realme 12X 5G) ధ‌ర రూ.12,000 లోపే ఉంటుంద‌ని తెలుస్తున్న‌ది. 45వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తు (45W SuperVOOC fast charging)తో ప‌ని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. రూ.12 వేల లోపు ధ‌ర‌తో వ‌స్తున్న తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ఇది అని రియ‌ల్‌మీ పేర్కొంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తోపాటు డ్యుయ‌ల్ స్పీక‌ర్ల‌తోపాటు 7.69మిమీ థిక్‌నెస్ క‌లిగి ఉంటుంది. రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్ వీసీ కూలింగ్ (VC cooling)తోపాటు 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ (6nm MediaTek Dimensity 6100+ 5G) ప్రాసెస‌ర్‌తో రానున్న‌ది.

రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. ఎయిర్ గెశ్చ‌ర్ ఫీచ‌ర్‌తో వ‌స్తున్న రియ‌ల్‌మీ 12ఎక్స్ 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, ఐపీ54 స‌ర్టిఫైడ్ బిల్ట్ తో వ‌స్తోంది. రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జ‌రుగుతాయి.

ఈ నెల 21న చైనా మార్కెట్లో ఆవిష్క‌రించిన రియ‌ల్‌మీ 12ఎక్స్ ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధ‌ర సుమారు రూ.16 వేలు (1399 చైనా యువాన్లు) ప‌లుకుతుంది. ఈ నెల ప్రారంభంలోనే రియ‌ల్‌మీ 12+ 5జీ ఫోన్ రూ.20,999, రియ‌ల్‌మీ 12 5జీ ఫోన్ రూ.16,999ల‌కు ల‌భిస్తున్నాయి.

First Published:  28 March 2024 8:00 AM IST
Next Story